The Vaccine War: కరోనాతో 40 కోట్ల మంది భారతీయులు చనిపోతారన్నారు.. మా సినిమా నేపథ్యమిదే: డైరెక్టర్‌

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా 200 కోట్ల వరకు వసూలు చేసింది. అదే సమయంలో వివాదాలు కూడా మోసుకొచ్చింది. చాలామంది ప్రముఖులు ఈ సినిమాపై పెదవి విరిచారు. అయితే తన కెరీర్‌లో ఎక్కువగా వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకునే సినిమాలు తెరకెక్కిస్తున్నారు వివేక్‌ అగ్నిహోత్రి.

The Vaccine War: కరోనాతో 40 కోట్ల మంది భారతీయులు చనిపోతారన్నారు.. మా సినిమా నేపథ్యమిదే: డైరెక్టర్‌
The Vaccine War Movie

Updated on: Sep 21, 2023 | 6:43 PM

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా 200 కోట్ల వరకు వసూలు చేసింది. అదే సమయంలో వివాదాలు కూడా మోసుకొచ్చింది. చాలామంది ప్రముఖులు ఈ సినిమాపై పెదవి విరిచారు. అయితే తన కెరీర్‌లో ఎక్కువగా వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకునే సినిమాలు తెరకెక్కిస్తున్నారు వివేక్‌ అగ్నిహోత్రి. ఇప్పుడు కూడా ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ కరోనా నాటి పరిస్థితులను బిగ్‌ స్క్రీన్‌పై చూపించనున్నారు. ఈ సినిమాతో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ, నానా పటేకర్, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సాధారణంగానే వ్యాక్సిన్‌ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది కరోనా వైరస్‌. అయితే ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం కరోనా గురించి కాదని వివేక్ అగ్నిహోత్రి అంటున్నారు. కోవిడ్ -19 వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తల గురించి మాత్రమే తమ సినిమాలో చూపిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్‌. ‘నా కెరీర్‌లో ఇది చాలా ముఖ్యమైన సినిమా. రెండేళ్ల క్రితం మనం బతుకుతామో లేదో అనే భయంతో ఉండేవాళ్లం. ఈరోజు ఎదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఇది ఎలా సాధ్యం? మమ్మల్ని ఎవరు రక్షించారు? ప్రాణాలు కాపాడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ని కనిపెట్టి మన ప్రాణాలను కాపాడారు. ఆ సూపర్‌హీరోల గురించి ప్రపంచానికి తెలియజేయడమే మా సినిమా లక్ష్యం. ఇందులో సామాజిక సందేశం, ఎమోషనల్‌ కంటెంట్‌ అన్నీ ఉంటాయి. అయితే తన సినిమా కోవిడ్‌కు సంబంధించినది కాదు’.

‘ మన దేశం వ్యాక్సిన్‌ను కనుగొనడం గొప్ప విజయం. కరోనా పరిస్థితుల్లో భారతదేశంలో 40 నుండి 50 కోట్ల మంది చనిపోతారని చాలా మంది చెప్పారు. వ్యాక్సిన్‌ కనిపెట్టలేక భారత్‌ ఓడిపోతుందని ఓ పెద్ద ముఠా ఎదురుచూసింది. ఇంకొందరు ఎక్కువ మంది చనిపోవాలని కూడా కోరుకున్నారు. వ్యాక్సిన్‌లకు భారతదేశాన్ని పెద్ద మార్కెట్‌గా మార్చడమే అతని లక్ష్యం. విదేశీ వ్యాక్సిన్ తయారీదారులు భారతదేశంలోని కొంతమంది వ్యక్తులతో కుట్ర చేసి, వ్యాక్సిన్‌ను మన దేశంలో విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ విషయాలన్నీ ఈ సినిమాలో చర్చించాం. ఎంతో అధ్యయనం చేసిన తర్వాత ఈ సినిమా చేశాం. భారతదేశంలోని అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు మాతో పాలుపంచుకున్నాయి. ఇది భారతదేశపు తొలి బయో సైన్స్ సినిమా. సినిమాపై 100% నమ్మకం ఉన్న ఆర్టిస్టులతో కలిసి పనిచేశాను. మా సినిమాలోని నటీనటులు పాత్రకు ప్రాణం పోశారు. వివాదాలకు భయపడలేదు. సమస్య ఉన్నప్పుడు, ప్రశ్న లేవనెత్తాలి. మన సినిమాల నుంచే చర్చ మొదలవ్వాలనేది నా ఉద్దేశం. అందుకు నేను వివాదాలకు భయపడను. ఈసారి కష్టమైన, రిస్క్‌తో కూడిన సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాను. వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ సినిమా అంటే పాటలు, నృత్యం మాత్రమే కాదు’ అని చెప్పుకొచ్చారు వివేక్‌ అగ్నిహోత్రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.