Director Teja: నా కూతురికి పెళ్లి చేయను.. షాకింగ్ విషయం చెప్పిన దర్శకుడు తేజ
చిత్రం సినిమాతో దర్శకుడిగా మారారు తేజ. అందమైన ప్రేమ కథలను చాలా సహజంగా.. మన పక్కింట్లోనో.. లేక మన ఊరిలోనో జరిగిన కథలుగా తెరకెక్కిస్తారు తేజ. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో జయం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో తేజ ఒకరు. చిత్రం సినిమాతో దర్శకుడిగా మారారు తేజ. అందమైన ప్రేమ కథలను చాలా సహజంగా.. మన పక్కింట్లోనో.. లేక మన ఊరిలోనో జరిగిన కథలుగా తెరకెక్కిస్తారు తేజ. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో జయం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు తేజ. ప్రస్తుతం అహింస అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తేజ. ఈ సినిమాతో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు తేజ.
తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడిన తేజ. తన కూతురికి పెళ్లి చేయను అని చెప్పి షాక్ ఇచ్చారు. అలాగే తన కొడుకు హీరోగా పరిచయం కానున్నారని తెలిపారు. ఇప్పటికే తన కొడుకు నటనలో శిక్షణ తీసుకున్నాడని త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిపారు తేజ.
తన కూతురి గురించి మాట్లాడుతూ.. ఇటీవలే ఆమె విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని వచ్చిందని.. నేను మాత్రం తనకు పెళ్లి చేయను అని చెప్పేశా.. నీకు నచ్చిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రా.. వచ్చిన తర్వాత నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పను అని తెలిపారు తేజ. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత తాను నచ్చకపోతే వెంటనే విడకులు కూడా తీసుకోమని కూడా చెప్పా అని తెలిపారు తేజ.