
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించినవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఆయన సినిమాల్లో దాదాపు స్టార్ హీరోలు, నటీనటులే కనిపిస్తుంటారు. ఇప్పుడు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ అడ్వెంచెరస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా భారీ బ్లాక్ బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజమౌళి ఇప్పుడు ఓ చిన్న సినిమాపై తెగ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్ ) లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ‘ చాలా రోజుల తర్వాత ఓ అద్భుతమైన సినిమా చూశాను. ఈ మూవీ నా మనసును కదిలించింది. కడుపుబ్బా నవ్వించింది. ప్రారంభం నుంచి చివరి సన్నివేశం వరకూ ఎంతో ఆసక్తిగా ఉంది. అభిషాన్ గొప్పగా రచించి డైరెక్షన్ చేశారు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది. మీరంతా కూడా కచ్చితంగా చూడండి’ అని అందులో రాసుకొచ్చారు. ఇలా రాజమౌళి ప్రశంసలు అందుకున్న ఆ మూవీ ఏంటో తెలుసా? ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే ఓ తమిళ సినిమా. మే01న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రాజమౌళి కంటే ముందు పలువరు సినీ ప్రముఖులు, విమర్శకులు ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఎలాంటి వాణిజ్య అంశాలు లేకుండా సింపుల్ గా సాగుతుంది. శ్రీలంక నుంచి తప్పించుకుని భారతదేశానికి ఒక చిన్న కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించగా, ‘నాడోడిగళ్’ ఫేమ్ శశికుమార్ కథానాయకుడిగా కనిపించారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాకు అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాణానికి అయిన బడ్జెట్ కేవలం 14 కోట్లు మాత్రమే. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 20 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ తమిళనాడులో ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. త్వరలోనే దీన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసే అవకాశం ఉంది.
Saw a wonderful, wonderful film Tourist Family.
Heartwarming and packed with rib-tickling humor. And kept me intrigued from beginning till end. Great writing and direction by Abishan Jeevinth.
Thank you for the best cinematic experience in recent years.
Don’t miss it…— rajamouli ss (@ssrajamouli) May 19, 2025
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా కోసం అనేక హాలీవుడ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇది ఒక అడ్వెంచర్ యాక్షన్ చిత్రం. భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో కూడా ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
#TouristFamily – SUCCESSFUL 15th DAY in Theatres 🤗❤️
The MEGA BLOCKBUSTER wholesome family entertainer continues its dream run !
Over 1 Million+ tickets booked online on BookMyShowdirected by @abishanjeevinth @RSeanRoldan
@SimranbaggaOffc @MillionOffl @MRP_ENTERTAIN pic.twitter.com/0xMPWCW0we
— M.Sasikumar (@SasikumarDir) May 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.