SJ Suryah: ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఫస్ట్ పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
ఓవైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరోవైపు నటుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాదు.. ప్రతినాయకుడి పాత్రలలోనూ ఎస్జే సూర్య అలరించారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో అలరించిన ఆయన.. ఇప్పుడు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.

ఎస్జే సూర్య… తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. నటుడిగా.. దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఖుషి సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా సొంతం చేసుకున్నారు. ఓవైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరోవైపు నటుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాదు.. ప్రతినాయకుడి పాత్రలలోనూ ఎస్జే సూర్య అలరించారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో అలరించిన ఆయన.. ఇప్పుడు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.
ఎస్జే. సూర్య.. ఇన్ స్టాలోకి అడుగుపెట్టారు. ఆయన ఇన్ స్టా ఖాతా ఓపెన్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపు 2 వేలకు పైగా ఫాలోవర్లు యాడ్ అయ్యారు. ఇప్పటివరకు ట్విట్టర్ ద్వారా మాత్రమే సినిమాలు, ఇతర అప్డేట్స్ ఇచ్చిన ఆయన.. ఇకపై ఇన్ స్టాలోనూ కొత్త అప్డేట్ అందించనున్నారట. ఇక ఎస్ జే సూర్య ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆయనకు సోషల్ మీడియాలోకి స్వాగతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎస్జే సూర్య.. మార్క్ ఆంటోనీ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తమిళ్ స్టార్ విశాల్ హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో సూర్య పాత్ర పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాలోనూ నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.