Ranga Maarthaanda: రంగమార్తండ స్పెషల్ షో చూస్తూ శేఖర్ కమ్ముల కంటతడి.. డైరెక్టర్ కృష్ణవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్.

Ranga Maarthaanda: రంగమార్తండ స్పెషల్ షో చూస్తూ శేఖర్ కమ్ముల కంటతడి.. డైరెక్టర్ కృష్ణవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు..
Sekar Kammula

Updated on: Mar 17, 2023 | 9:42 AM

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా కాలం తర్వాత రూపొందిస్తోన్న సినిమా రంగమార్తాండ. ఎన్నో సూపర్ హిట్స్ తెరకెక్కించిన కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో రంగమార్తండ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా స్పెషల్ షో స్క్రీనింగ్ వేశారు. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు డైరెక్టర్ కృష్ణవంశీపై ప్రశంసలు కురిపించారు.

ఫిదా, లవ్ స్టోరీ, హ్యాపీ డేస్ వంటి సూపర్ సక్సెస్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల సైతం రంగమార్తండ సినిమా స్పెషల్ షో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను కృష్ణవంశీగారికి పెద్ద అభిమానిని. ఆయన నుంచి ఎప్పుడు ఏ సినిమా వస్తున్నా, ఆ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటాను. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఆయన విశ్వరూపం చూడటానికి ఎదురుచూస్తున్నాను. ఇక ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ మధ్య కాలంలో సినిమా చూస్తూ నేను ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదు. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు నా కళ్ల వెంట నీళ్లు వచ్చేశాయి. ఇది చాలా గొప్ప సినిమా. నిజంగా మంచి విజయాన్ని అందుకుంటుంది ” అంటూ చెప్పుకొచ్చారు.