Director Shankar: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్ తనయుడు.. ఆ సినిమా సీక్వెల్ తోనేనా..?

|

Jan 29, 2022 | 3:35 PM

టాప్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా 15 మూవీ. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Director Shankar: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్ తనయుడు.. ఆ సినిమా సీక్వెల్ తోనేనా..?
Sankar
Follow us on

Director Shankar: టాప్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా 15 మూవీ. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాతోపాటు కమల్ హాసన్ తో  భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అనుకోని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు బాలీవుడ్ ,స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో సినిమా చేస్తున్నారు శంకర్. తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన అపరిచితుడు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు శంకర్ తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అర్జిత్ శంకర్ తమిళంలో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నాడు.  శంకర్ అసోసియేట్ బాలాజీ శక్తివేల్  ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అర్జిత్ ఇప్పటికే నటన – ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ పొందాడు.అందుకోసం ఆయన ‘కాదల్’ సీక్వెల్ ను ఎంచుకోవడం విశేషం. కాదల్ సినిమా తెలుగులో ప్రేమిస్తే గా వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తో ఆర్జిత్ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. శంకర్ కూతురు ‘అదితి’ కూడా హీరోయిన్ గా రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: బ్లడ్ క్యాన్సర్‏తో పోరాడుతున్న ఆర్టిస్ట్.. ఆదుకోవాలంటూ డైరెక్టర్ రాజమౌళి విజ్ఞప్తి..

Best Buddies: నాటి చిన్న నాటి స్నేహితులు.. క్లాస్ మేట్స్.. నేడు సెలబ్రేటీలు.. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా

Megastar Chiranjeevi: క్వారంటైన్‏లో ఉన్నాను అందుకే నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాను.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..