
గ్రాఫిక్స్ అంతగా లేని టైమ్‌లోనే టెక్నాలజీతో చెడుగుడు ఆడుకున్నారు శంకర్. అలాంటిదిప్పుడు ఊరుకుంటారా చెప్పండి..? విజువల్ ఎఫెక్ట్స్‌తో ఫుట్ బాల్ ఆడేసుకోరూ..? ఇండియన్ 2 కోసం ఇదే చేస్తున్నారు శంకర్. ఎలాగూ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉంది కదా మరో రిస్క్ తీసుకుంటున్నారు. మరి ఇంతకీ ఇండియన్ 2 కోసం ఆయన చేస్తున్న ఆ సాసహమేంటి..? అది బడ్జెట్‌పై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో మరి.. సాధారణంగా గ్రాఫిక్స్ మాయాజాలాలన్ని శంకర్ సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. ఆయన సినిమాల్లో ఒక్క పాటకు అయ్యే ఖర్చుతో మొత్తం సినిమానే తీస్తుంటారు కొందరు దర్శకులు. కానీ శంకర్ మాత్రం నో కాంప్రమైజ్ అంటుంటారు. అసలు గ్రాఫిక్స్ అంటే తెలియని రోజుల్లోనే జీన్స్, ఒకే ఒక్కడు, కమల్ హాసన్ భారతీయుడు లాంటి సినిమాలలోని పాటల్లో అద్భుతాలు చేసారు శంకర్. అప్పుడే అంతలా చెలరేగిపోయిన శంకర్.. ఇప్పుడొచ్చిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఊరుకుంటారా..? ఈ మధ్య శంకర్ ఎక్కువగా టెక్నాలజీపైనే ఫోకస్ చేస్తున్నారు.
కాగా ఒకప్పట్లా ఈయన సినిమాల్లో కథా బలం కనిపించడం లేదు.. కేవలం వీఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారనే విమర్శలు కూడా బానే వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు కంటెంట్ కూడా బలంగానే ఉండబోతుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కొందరు దర్శకులకు వరంగా మారితే.. నిర్మాతలకు మాత్రం శాపంగా మారుతుందనిపిస్తుంది. అసలే గ్రాఫిక్స్ అంటూ స్టూడియో సెట్స్‌ను మించి ఖర్చు పెట్టిస్తున్న దర్శకులకు AI కనబడని వరమైంది. ఈ టెక్నాలజీని ఇండియన్ 2లో వాడుకుని ఈ మధ్యే చనిపోయిన కమెడియన్ వివేక్, సీనియర్ నటుడు నెడుమూడి వేణును స్క్రీన్ మీద రీ క్రియేట్ చేయబోతున్నారు శంకర్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.