Dhanush : ‘ఆ దర్శకుడు నన్ను కొట్టేవాడు’.. సంచలన విషయం చెప్పిన ధనుష్

తమిళనాట స్టార్ హీరోల లిస్ట్ లో ముందువరసలో ధనుష్(Dhanush)కూడా ఉంటారు. హీరో అవ్వడానికి కలర్, పర్సనాలిటీ అవసరం లేదు టాలెంట్ ఉంటే చాలు ని నిరూపించిన వారిలో ధనుష్ ఒకరు.

Dhanush : 'ఆ దర్శకుడు నన్ను కొట్టేవాడు'.. సంచలన విషయం చెప్పిన ధనుష్
Danush
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 29, 2022 | 10:58 AM

తమిళనాట స్టార్ హీరోల లిస్ట్ లో ముందువరసలో ధనుష్(Dhanush)కూడా ఉంటారు. హీరో అవ్వడానికి కలర్, పర్సనాలిటీ అవసరం లేదు టాలెంట్ ఉంటే చాలని నిరూపించిన వారిలో ధనుష్ ఒకరు. తమిళ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న ధనుష్.. బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగులోకూడా స్ట్రైట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమాలో లెక్చరర్‌గా కనిపించనున్నాడు ధనుష్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ధనుష్ పదహారేళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి కార్తీక్ రాజా ప్రోత్సాహంతో తెరంగేట్రం చేసిన ధనుష్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. 2002 లో తండ్రి కస్తూరి రాజా రూపొందించిన `తుల్లువదో ఇళ్లమై` అనే సినిమాతో హీరోగా ధనుష్ పరిచయం అయ్యారు.

ఆ తర్వాత తన అన్న సెల్వ రాఘవన్ తో కాదల్ కొండెయిన్ అనే సినిమా చేశాడు ధనుష్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతోపాటు ధనుష్ కు మంచి పేరొచ్చింది. ఈ సినిమాతర్వాత ధనుష్ క్రేజ్ పెరిగింది. ఇటీవల ఓ ఇంట్రవ్యూలో ధనుష్ మాట్లాడుతూ.. మంచి నటనను రాబట్టేందుకు తన అన్న సెల్వ రాఘవన్ కొట్టేవాడని ధనుష్ చెప్పుకొచ్చారు. ఆ రోజు ఆయన కొట్టడం వల్లే ఇప్పుడు నా నటనను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని ధనుష్ అన్నారు. ధనుష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తెలుగు , తమిళ్ భాషల్లో సార్ సినిమా రెడీ అవుతోంది. అలాగే ఇటీవల హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు ధనుష్.

ఇవి కూడా చదవండి
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?