AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma : ఆయన ఒక గొప్ప వ్యక్తి.. ఇప్పటికీ ఎప్పటికీ అతడే బెస్ట్ లిరిసిస్ట్.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అప్పట్లో వరుస సినిమాలను రూపొందిస్తూ బిజీగా ఉన్న వర్మ.. ఇప్పుడు అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

Ram Gopal Varma : ఆయన ఒక గొప్ప వ్యక్తి.. ఇప్పటికీ ఎప్పటికీ అతడే బెస్ట్ లిరిసిస్ట్.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్..
Ram Gopal Varma
Rajitha Chanti
|

Updated on: May 16, 2026 | 8:19 AM

Share

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో జీవితం, విజయం, వైఫల్యం, అలాగే గొప్ప వ్యక్తుల ప్రభావంపై తన అభిప్రాయాలను వెల్లడించారు వర్మ. విజయం ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని, అయితే వైఫల్యం నుండి నేర్చుకుంటేనే అది ఒక కథగా మారుతుందని అన్నారు. తన ఆలోచనలను ఇతరులపై రుద్దనని స్పష్టం చేశారు. బాబాలు (గరువులు) లాంజ్ మ్యూజిక్ లాగా కేవలం చెబుతూ పోతారని, అయితే నిజమైన గొప్ప ఆలోచనాపరులు తమ మాటల ద్వారా సమాజంపై ప్రభావం చూపుతారని ఆయన తేల్చి చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిని తెలుగు సినిమా చరిత్రలో అత్యుత్తమ గేయ రచయిత అని అన్నారు. వేటూరి సుందరరామమూర్తి, ఆత్రేయ వంటి గొప్ప రచయితలతో పోల్చినప్పటికీ, సిరివెన్నెలనే తన దృష్టిలో అగ్రగణ్యులని ఆయన స్పష్టం చేశారు. ఒక గేయరచయిత గొప్పతనాన్ని కొలవడానికి ఆయన కొన్ని కొలమానాలను సూచించారు. పాట సాహిత్యం ఎంతకాలం గుర్తుంటుంది, అది ప్రేక్షకుడిపై ఎంత ప్రభావం చూపింది, రచయిత ప్రత్యేకమైన వ్యక్తిత్వం (ఆయన పదునైన చూపులు, గంభీరమైన స్వరం వంటివి) అని తెలిపారు..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..

సిరివెన్నెల ఆలోచనలు కేవలం అందమైన ఆదర్శాలుగానే మిగిలిపోయాయని, వాటికి ఆచరణాత్మక కోణం రాలేదని అన్నారు. ఈ విషయాన్ని వివరించడానికి ఆయన ఆరడుగుల బుల్లెట్ పాట ఉదాహరణను ప్రస్తావించారు. ఆ పాట సాహిత్యం గురించి సిరివెన్నెలతో జరిగిన సంభాషణలో, దాని సాహిత్యం సరికాదని సిరివెన్నెల ఆందోళన చెందారని వర్మ గుర్తు చేసుకున్నారు. అయితే, అటువంటి మాస్ పాటలలో ప్రేక్షకులు “ఆరడుగుల బుల్లెట్” అనే ఒక్క పదాన్ని తప్ప, మిగిలిన సాహిత్యాన్ని గుర్తుంచుకోరని చెప్పుకొచ్చారు. స్టార్‌డమ్ ఉన్న హీరోల పాటలలో బీట్, డ్యాన్స్ మాత్రమే చూస్తారని, సాహిత్యంపై ఎవరూ అంతగా దృష్టి పెట్టరని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..

ప్రజలు ప్రతీ విషయాన్ని రచయిత లేదా తాను అనుకున్న విధంగానే గ్రహిస్తారని భావించడం ప్రాథమికంగా తప్పు అని స్పష్టం చేశారు. ఒక లిరిసిస్ట్ తన రచనలోని ఒక అంశంపై దృష్టి పెట్టినప్పటికీ, సామాన్య ప్రేక్షకులు సాధారణంగా క్యాచీ పాయింట్‌లను మాత్రమే గుర్తుంచుకుంటారని చెప్పుకొచ్చారు. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘క్షణక్షణం’ సినిమాలో సిరివెన్నెల రాసిన “జామురాతిరి జాబిలమ్మ” పాట ఇప్పటికీ తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..

ఎక్కువ మంది చదివినవి :  Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..

Follow Us