AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmastra: బ్రహ్మస్త్ర సినిమా స్టోరీ ఇదే.. ఆసక్తికర విషయాలను పంచుకున్న దర్శకధీరుడు..

ఈ సందర్భంగా బ్రహ్మస్త్ర చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు జక్కన్న. బ్రహ్మస్త్ర.. అస్త్రాల గురించి చెబుతూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Brahmastra: బ్రహ్మస్త్ర సినిమా స్టోరీ ఇదే.. ఆసక్తికర విషయాలను పంచుకున్న దర్శకధీరుడు..
Rajamouli
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2022 | 3:15 PM

Share

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈమూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగా.. మరోవైపు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. భారీ బడ్జె్ట్‏తో పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, షారుఖ్ ఖాన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈమూవీ సెప్టెంబర్ 9న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మస్త్ర చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు జక్కన్న. బ్రహ్మస్త్ర.. అస్త్రాల గురించి చెబుతూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

” 2016లో డైరెక్టర్ అయాన్ నన్ను మొదటిసారిగా కలిసి బ్రహ్మస్త్ర స్టోరీ చెప్పారు. మన హిందూ పురాణాలు ఆధారంగా చేసుకొని రాసిన కథ ఇది. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న శక్తులన్నింటినీ కలిపి అస్ర్తవర్స్ క్రియేట్ చేసాడు. అసలు ఈ అస్త్రవర్స్ అంటే ఏమిటి. మన శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూల కారణం మంచభూతాలు. వాటిని శాసించేది బ్రహ్మా శక్తి. అలాంటి దాని నుంచి పుట్టిన అస్త్రాలు, వాటిని ప్రయోగించే సూపర్ హీరోలు… వారి మధ్య వచ్చే విభేధాలు.. వీటన్నింటినీ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి అత్యద్భుతమైన విజువల్ వండర్ లా అయాన్ బ్రహ్మాస్త్రను సృష్టించాడు. వీటిన్నింటికన్నా బలమైన శక్తి మరొకటి ఉంది. అదే ప్రేమ. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ.. ఎలాంటి శక్తినైనా ఎదుర్కొగలదని ఈ సినిమా ద్వారా అయాన్ చూపించాడు. ఈ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది” అంటూ చెప్పుకొచ్చారు జక్కన్న.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.