Cobra Movie: ప్రేక్షకుల కోరిక మేరకు ‘కోబ్రా’ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం.. ఏంటంటే..
ఈ క్రమంలో తాజాగా కోబ్రా టీం మేకర్స్ కీలకనిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1న సాయంత్రం నుంచి ఈ సినిమా

చాలా కాలం తర్వాత తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ (Vikram Chiyaan) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కోబ్రా. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 31న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి, మృణాళిని, మీనాక్షి కథానాయికలుగా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోన్న ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందంటూ ప్రేక్షకులు చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీ పూర్తిగా 3 గంటల నిడివి ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కోబ్రా టీం మేకర్స్ కీలకనిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1న సాయంత్రం నుంచి ఈ సినిమా ప్రదర్శనలో 20 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు ప్రకటించారు.
అంటే గురువారం సాయంత్రం నుంచి ప్రదర్శించే కోబ్రా సినిమా 20 నిమిషాలు నిడివిని కత్తిరించి ప్లే చేయనున్నారు. అభిమానులు, సినీ విమర్శకుల నుంచి వచ్చిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. మూడేళ్ల తర్వాత విక్రమ్ నటించిన ఈ సినిమా తొలిసారిగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మించారు. మేము మీ అభ్యర్థనలు విన్నాము. ప్రేక్షసులు, అభిమానులు, మీడియా సన్నిహితులు, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సూచించిన విధంగానే కోబ్రా సినిమా ఇప్పుడు 20 నిమిషాలు ట్రిమ్ చేయబడింది. ఈ సాయంత్రం నుంచి అన్ని థియేటర్లలో ప్రదర్శించబడుతుంది అంటూ రాసుకొచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.




ట్వీట్..
We Heard You ?#Cobra is now Trimmed by 20 Mins as suggested by film-goers,fans,media friends, distributors & exhibitors ?
Will be updated from this evening in all the screens ☺️ Do watch & support the film..@chiyaan@AjayGnanamuthu@RedGiantMovies_ @SonyMusicSouth pic.twitter.com/4a4mlnYOF2
— Seven Screen Studio (@7screenstudio) September 1, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.