
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పాన్ గ్లోబల్ రెంజ్ తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే.. ఎస్.ఎస్. రాజమౌళి ఒక అభిమానిపై కోప్పడిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సంఘటన 2025 జూలై 13న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు నివాసంలో జరిగింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాస్ రావు ఇటీవల కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం కన్నుమూశారు. కోటశ్రీనివాస్ భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
సినీ ప్రముఖులతో పాటు కోట శ్రీనివాసరావు మరణంతో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాజమౌళి, ఆయన భార్య రమాతో కలిసి వచ్చారు. నివాళులు అర్పించిన తర్వాత తిరిగి వెళ్తుండగా, ఒక అభిమాని సెల్ఫీ కోసం రాజమౌళిని వెంబడించాడు. రాజమౌళి వెంటపడుతూ.. కారు వద్దకు వచ్చే వరకూ ఇబ్బంది పెట్టాడు. ముందు ఓపికకాగా ఉన్న రాజమౌళి.. ఆతర్వాత అభిమాని అత్యుత్సహంతో మీద పడటంతో కోప్పడ్డారు. సెల్ఫీ కోసం పట్టుబట్టడంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేసి, ఆ అభిమానిని పక్కకు నెట్టారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిపై నెటిజన్లు రాజమౌళి అసహనాన్ని సమర్థిస్తూ, అటువంటి సందర్భంలో సెల్ఫీ కోసం ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా కొంతమంది సెల్ఫీలు అంటూ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి , మహేష్ బాబు సినిమా విషయానికొస్తే.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.