K.Raghavendra Rao: సామాన్యుడి కోసం దర్శకేంద్రుడి మరో ముందడుగు.. ఆ కారణంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రాఘవేంద్రరావు..
ఇటీవలే ఆయన పెళ్లి సందD సినిమాకు దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉన్నారు. ఇక ఈ సినిమాతోనే నటుడిగా వెండితెరపై కనిపించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమయ్యారు. తాజాగా ఆయన సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు.

తెలుగు తెరపై శతాధిక చిత్రాలను రూపొందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు. దాదాపు 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన.. కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తనదైన ముద్రవేశారు. శాంతి నివాసం అనే ధారావాహికకు దర్శకత్య పర్యవేక్షకుడిగా అరంగేట్రం చేశారు. సినీ పరిశ్రమకు ఎంతో మంది నటీనటులను పరిచయం చేసిన గుర్తింపు ఆయనదే. ముఖ్యంగా కథానాయికలను మరింత అందంగా సిల్వర్ స్క్రిన్ పై చూపించడంలోనూ రాఘవేంద్రరావుది ప్రత్యేకశైలి. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన ఆయన కొద్ది రోజులుగా సినిమాలను తెరకెక్కించడం తగ్గించారు. ఇటీవలే ఆయన పెళ్లి సందD సినిమాకు దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉన్నారు. ఇక ఈ సినిమాతోనే నటుడిగా వెండితెరపై కనిపించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమయ్యారు. తాజాగా ఆయన సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని.. నటీనటులుగా.. దర్శకులుగా.. సంగీతదర్శకులుగా స్థిరపడిపోవాలనుకుంటారు. అవకాశాల కోసం భాగ్యనగరంలోని ప్రతి ఆఫీసు చుట్టూ తిరుగుతుంటారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో సక్సెస్ అయిన వారిలో ప్రతి ఒక్కరు కృష్ణానగర్ కష్టాలను చూసినవారే. అవకాశాల కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నవారే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరిని సెలబ్రెటీని చేసేస్తుంది సోషల్ మీడియా. యూట్యూబ్ స్టార్లుగా కెరీర్ ఆరభించి సినిమాల్లో మెరిసినవారు చాలమంది ఉన్నారు. ఇక ఇప్పుడు అదే యూట్యూబ్ వేదికగా సామాన్యుడిని సెలబ్రెటీని చేసేందుకు సిద్ధమయ్యారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.




కేఆర్ఆర్ వర్క్స్ పేరిట ఆయన ఓ కొత్త యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూసే యువత కోసం ఆయన వారధి అయ్యేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఇటీవలే డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. “రాఘవేంద్ర రావు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది నటీనటులను పరిచయం చేశారు. ఇంకా కొత్తవారిని ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలనే తపన ఆయనకు పోలేదు. అందుకే కేఆర్ఆర్ వర్క్స్ పేరుతో ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్నారని అన్నారు. నా చేతుల మీదుగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది. ” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక యాంకర్ సుమ మాట్లాడుతూ.. టాలెంట్ ఉండి ముందుకు రాలేని ఎంతో మంది సామాన్యులకు సినీ పరిశ్రమలో అవకాశాలు వరించే విధంగా ఈ ఛానల్ ప్రారంభించారు. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్, స్క్రిప్టులు, యాక్టింగ్ రీల్స్, మ్యూజిక్స్ ఆల్భమ్స్, వెబ్ సిరీస్ కథలను పంచుకోవాలని తెలిపారు. ‘కేఆర్ఆర్ వర్క్స్’ ఛానల్ ఓ మైయిల్ అడ్రస్ ను కూడా అందుబాటులో ఉంచారు.
కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలి అని నేను సంకల్పించిన మహాయజ్ఞం లో భాగంగా ఈ రోజు రాజమౌళి చేతుల మీదుగా KRR Works అనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించడం జరిగింది. https://t.co/k3dM1AyDq2
Like, Share and Subscribe
K Raghavendra Rao
— Raghavendra Rao K (@Ragavendraraoba) February 2, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
