AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Astrology: కుజ, బుధుల యుతి.. అనుకున్న లక్ష్యాలు సాధించే రాశులు ఇవే..!

ప్రస్తుతం మీన రాశిలో కుజ, బుధులు కలిసి ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు ఏ రాశిలో కలిసినా కొన్ని రాశుల వారిలో విపరీతమైన పట్టుదల పెరుగుతుంది. వారు అనుకున్నది సాధించనిదే విడిచిపెట్టరు. మీన రాశి బుధుడికి నీచ రాశి అయినప్పటికీ నీచభంగం జరిగింది. ఈ రెండు గ్రహాల యుతి వల్ల ఏప్రిల్ చివరి వరకూ వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు వృత్తి, ఉద్యోగాలు, విదేశీయానం, గృహ, వాహనాలు, ధన సంపాదన వంటి విషయాల్లో మరింత పట్టుదలగా, స్థిరంగా వ్యవహరించి అనుకున్నవి సాధించడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2026 | 1:25 PM

Share
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల విదేశాల్లో చదువులు, విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ రాశివారు బాగా పట్టుదలగా, అవిశ్రాంతంగా శ్రమించి తమ ఆశల్ని, ఆశయాన్ని తప్పకుండా సాధించుకుంటారు. రావలసిన డబ్బును రాబట్టుకోవడం, ఆస్తి వివాదాన్ని ఏదో విధంగా పరిష్కరించుకోవడం, వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం వంటివి జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

1 / 6
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు కుజుడితో యుతి చెందడం వల్ల ఈ రాశివారు వృత్తి, వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాటపట్టిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు కోవడానికి ప్రయత్నిస్తున్న వారికి అదనపు ఆదాయ మార్గాలు, అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే అవకాశం కూడా ఉంది.

2 / 6
కన్య: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల ఆస్తుల్ని, సంపదను పెంచుకోవడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ పరిస్థితిని మెరుగుపరుస్తారు. ఆర్థిక, వ్యక్తి గత సమస్యల నుంచి బయటపడడం మీద దృష్టి పెడతారు. విద్యార్థులు ఎంత శ్రమకైనా ఓర్చి, చదువులు, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

3 / 6
ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల ఆస్తుల్ని పెంచుకోవడం మీదా, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం మీదా, ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడం మీదా దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి తమ శక్తియుక్తులన్నిటినీ వెచ్చిస్తారు. ఆర్థిక పురోగతికి ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటారు. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది.

4 / 6
కుంభం: ధన స్థానంలో కుజ, బుధుల యుతి వల్ల ఈ రాశివారు గట్టి ప్రయత్నంతో అనుకున్నవన్నీ సాధించే అవకాశం ఉంది. మనసులోని కోరికలను పట్టుదలగా నెరవేర్చుకుంటారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద శ్రమ, శ్రద్ధ పెంచడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తన పనితీరుతో అధికారులను మెప్పించడం జరుగుతుంది. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. కొన్ని కీలక సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించుకుంటారు. ఉన్నత పదవులు పొందుతారు.

5 / 6
మీనం: ఈ రాశిలో కుజ, బుధుల కలయిక వల్ల లాభం లేనిదే ఏ పనీ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. లాభదాయక పరిచయాలను పెంపొందించుకుంటారు. ఆస్తి వివాదాలను, కోర్టు వివాదాలను రాజీ మార్గంతో పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రాపకంతో ప్రాభవాన్ని పెంచుకుంటారు. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యలను బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక పరిస్థితిని కొద్ది శ్రమతో బాగా మెరుగుపరచుకుంటారు.

6 / 6
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి