AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCHM JEE 2026 Admit Card: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో 026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE) 2026 పరీక్షకు సంబంధించిన..

NCHM JEE 2026 Admit Card: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
NCHMCT JEE City Allotment Slip
Srilakshmi C
|

Updated on: Apr 18, 2026 | 3:43 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో 026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE) 2026 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా నగరాల ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2026 పరీక్షను ఏప్రిల్ 25, 2026 (శనివారం) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇక పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచుతుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ (NCHM&CT) అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 వేలకి పైగా సీట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాత పరీక్ష విధానం

రాత పరీక్షలో మొత్తం 120 అబ్జెక్టివ్‌ టైప్‌ క్వశ్చన్‌లకు 480 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగెటివ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌ మాద్యమంలో మాత్రమే ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ ఎఫైర్స్‌లలో ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నల చొప్పున 45 ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 45 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌లో 30 ప్రశ్నలు వస్తాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us