AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: 45లోనూ 25లా కనిపించాలా ?? యవ్వనాన్ని నిలబెట్టే అసలైన రహస్యాలు

వయసు పెరగడం ప్రకృతి సహజం అయినప్పటికీ, యవ్వనంగా కనిపించడం అనేది మన జీవనశైలి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. అసలైన యవ్వనం ఖరీదైన క్రీముల్లో కాదు, మన శరీరంలోని కణాల్లోనే దాగి ఉంది. శాస్త్రీయంగా నిరూపించబడిన కొన్ని మార్పులను పాటించడం ద్వారా 45 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల యువకుడిలా కనిపించవచ్చు.

Phani CH
|

Updated on: Apr 18, 2026 | 1:14 PM

Share
టెలోమియర్స్: మన శరీరంలోని కణాలు ప్రతిరోజూ పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అయితే, వయసు పెరిగే కొద్దీ ఈ కొత్త కణాల ఉత్పత్తి వేగం తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డీఎన్‌ఏ చివర ఉండే టెలోమియర్స్. ఇవి డీఎన్‌ఏను రక్షించే ప్లాస్టిక్ క్యాప్‌ల వంటివి. టెలోమియర్స్ ఎంత పొడవుగా ఉంటే, మనం అంత యవ్వనంగా ఉంటాం. ఒత్తిడికి గురైనప్పుడు ఈ టెలోమియర్స్ వేగంగా అరిగిపోతాయి. అందుకే, ధ్యానం, ప్రశాంతమైన జీవనశైలి, మానసిక సంతోషం టెలోమియర్స్‌ను కాపాడి యవ్వనాన్ని నిలబెడతాయి.

1 / 7
చక్కెర: మనం తినే చక్కెర కేవలం బరువును పెంచడమే కాకుండా, మన చర్మాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీన్ని సైన్స్ పరిభాషలో గ్లైకేషన్ అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, అది కొల్లాజెన్ ప్రోటీన్‌తో కలిసిపోతుంది, దీనివల్ల కొల్లాజెన్ దెబ్బతిని చర్మం వదులుగా మారి, ముడతలు ఏర్పడతాయి. మీరు ఎన్ని క్రీములు వాడినా, చక్కెర అధికంగా తీసుకుంటే ముడతలు ఆగవు. కాబట్టి, చక్కెరను తగ్గించడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా, బిగుతుగా ఉంచుకోవచ్చు.

2 / 7
ఆటోఫాగీ మరియు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్: శరీరానికి తనను తాను శుభ్రం చేసుకునే అద్భుతమైన శక్తి ఉంది, దీనిని ఆటోఫాగీ అంటారు. మనం నిరంతరం తింటూ ఉంటే, శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికే శక్తిని ఉపయోగిస్తుంది. కానీ, 16 గంటల పాటు ఏమీ తినకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించినప్పుడు, శరీరం లోపల ఉన్న పాడైన కణాలను, వ్యర్థాలను వెతికి పట్టుకుని వాటిని రీసైకిల్ చేస్తుంది. ఇది కొత్త, ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. వారానికి కనీసం రెండు రోజులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల చర్మం మీద సహజమైన గ్లో వస్తుంది.

3 / 7
వ్యాయామం మరియు కండరాల ఆరోగ్యం: 40 ఏళ్లు దాటాక కండరాలు కరిగిపోవడం మొదలవుతుంది (సార్కోపీనియా). కండరాలు బలంగా ఉంటేనే చర్మం బిగుతుగా ఉంటుంది. కేవలం నడక మాత్రమే కాకుండా, బరువులు ఎత్తడం లేదా రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయడం అవసరం. శరీర భంగిమ నిటారుగా ఉంటే, మీరు వయసులో సగం కనిపిస్తారు. ఇది యవ్వనాన్ని ప్రతిబింబిస్తుంది.

4 / 7
గట్ హెల్త్: మన పేగుల్లోని బ్యాక్టీరియా (గట్ హెల్త్) మన అందాన్ని ప్రభావితం చేస్తుంది. కడుపు ఎంత శుభ్రంగా ఉంటే, చర్మం అంత తేటగా ఉంటుంది. జంక్ ఫుడ్స్ మంచి బ్యాక్టీరియాను నాశనం చేసి, మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలకు దారితీస్తాయి. పెరుగు, మజ్జిగ వంటి ప్రొబయోటిక్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి, రక్తం శుద్ధి అయ్యి, చర్మానికి సహజమైన రంగును ఇస్తుంది.

5 / 7
నిద్ర: నిద్ర అత్యంత ముఖ్యమైన యాంటీ ఏజింగ్ చికిత్స. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు శరీరంలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (యూత్ హార్మోన్) విడుదల అవుతుంది. ఈ హార్మోన్ కణాలను రిపేర్ చేసి, కొల్లాజెన్‌ను పెంచుతుంది. సరైన సమయానికి నిద్రపోకపోతే, ఈ కీలకమైన రిపేర్ ప్రక్రియను కోల్పోతారు. సమయానికి నిద్రపోవడం వల్ల శరీరం పునరుద్ధరించబడి, ప్రతి ఉదయం కొత్త మనిషిలా మేల్కొంటారు.

6 / 7
చర్మ సంరక్షణ: వంద రకాల క్రీములు అవసరం లేదు. సూర్యుడి నుండి వచ్చే కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ తప్పనిసరి. రాత్రి పూట రెటినాల్ వాడటం వల్ల ముడతలు తగ్గి కొత్త కణాలు పుడతాయి. ఉదయం విటమిన్ C సిరం వాడటం చర్మానికి రక్షణనిస్తుంది. వీటితో పాటు, తగినంత నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

7 / 7
Follow Us