నారింజ పండ్లు పుల్లగా ఉంటాయనో, జలుబు చేస్తుందనో చాలామంది వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ఈ సీజనల్ పండ్లను తప్పకుండా తినమంటున్నారు ఆహార నిపుణులు
TV9 Telugu
నారింజలో ‘విటమిన్ సి’ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అది శరీరంలో రోగనిరోధక శక్తి పెంచి ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది
TV9 Telugu
నారింజలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు, పీచు ఉన్నందున ఇదెంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మెండుగా ఉన్న సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచి జలుబూ జ్వరాల వంటి సాధారణ సమస్యలు మొదలు ఇతర అనారోగ్యాలనూ రానివ్వదు
TV9 Telugu
గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి-9 విటమిన్ నారింజలో సహజ సిద్ధంగా దొరుకుతుంది. నారింజరసం తాగడం వల్ల కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. చర్మం మృదువుగా, నిగారింపుతో ఉంటుంది
TV9 Telugu
మధుమేహ రోగులు కూడా నారింజ పండ్లు భేషుగ్గా తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ఎనీమియాతో బాధపడుతున్న వారు ఈ రసం తీసుకోవడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది
TV9 Telugu
వీటిలోని పీచు జీర్ణప్రక్రియకు దోహదం చేస్తే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. శరీరం ఐరన్‌ను త్వరగా గ్రహించేలా చేస్తాయీ పండ్లు
TV9 Telugu
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. గుండెజబ్బులు, ఆర్థరైటిస్‌లను నియంత్రిస్తాయి. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి మహమ్మారులను నిరోధిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి
TV9 Telugu
ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఈ పండును కోసిన వెంటనే తినాలి. ఆలస్యమైనకొద్దీ సి-విటమిన్ ఆవిరైపోతుంది