AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam: తెలుగు నటులను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన సీతారామం డైరెక్టర్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా.. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు థియేటర్స్ లు రావడం లేదు అనే అపోహను ఈ సినిమా చెరిపేసింది.

Sita Ramam: తెలుగు నటులను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన సీతారామం డైరెక్టర్
Hanu Raghavapudi
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2022 | 10:27 AM

Share

ఇటీవల వచ్చిన అందమైన ప్రేమకథలో ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తెరకెక్కిన సినిమా సీతారామం. యుద్ధం తో రాసిన ప్రేమకథ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా.. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు థియేటర్స్ లు రావడం లేదు అనే అపోహను ఈ సినిమా చెరిపేసింది. చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో ఆడిన హిట్ సినిమాగా సీతారామం సినిమా నిలిచింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ నటన, మృణాల్ అభినయం ప్రేక్షకులను అకట్టిపడేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటులను ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న ఇప్పటికే చాలా సార్లు వినిపించింది. తాజాగా దీని పై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు హనురాఘవాపుడి.

దర్శకుడు మాట్లాడుతూ.. అసలు ఈ కథ ఎలా పుట్టింది అన్నది వివరించారు. హను రాఘవపూడి మాట్లాడుతూ.. నాకు పుస్తకాలు కొనడం అలవాటు. అలా ఓసారి హైదరాబాద్‌లోని కోఠిలో కొన్న ఓ సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకంలో నాకు ఓపెన్‌ చేయని ఓ లెటర్ కనిపించిందట. హాస్టల్‌లో ఉంటున్న కొడుకుకి వాళ్ల అమ్మ రాసిన లేఖ అది. అది ఓపెన్ చేసి చూస్తే సెలవులకు ఇంటికి రమ్మని ఆ తల్లి రాసింది. ఆ లెటర్‌ చూశాక.. ఒకవేళ లెటర్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే.? అనే ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచన నుంచే ‘సీతారామం’ సినిమా పుట్టిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే తెలుగు నటులను తీసుకోకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏది లేదు అన్నారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం హీరోయిన్ ఎవరు అను ఆలోచిస్తున్న సమయంలో అమ్మాయి కొత్తగా ఉండాలని అనుకున్నాం. నిర్మాత స్వప్న అప్పడు మృణాల్ పేరు చెప్పారు. ఆమెను చూడగానే సీత పాత్రకు సరిపోతుందని అనిపించింది . అలాగే దుల్కర్ కూడా రామ్ పాత్రకు సరిగ్గా సరిపోతాడని అనుకున్నారట. అఫ్రిన్‌ పాత్ర అనుకోగానే రష్మిక అయితే బాగుంటుందనుకున్నాం.. అంతే కాదని మరో కారణం లేదు అన్నారు. తెలుగు వాళ్లు దొరికితే మాకే మంచిది.. భాష సమస్య ఉండదు అని అన్నారు హను రాఘవపూడి.