AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Varma: ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ సినిమాకు బ్రేక్.. అసలు విషయం చెప్పిన మేకర్స్..

వీరిద్దరి కాంబోలో వచ్చే ప్రాజెక్టుకు రాక్షస్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారని సమాచారం. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కొద్ది రోజులుగా ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడమే ఇందుకు కారణమని టాక్. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్.

Prashanth Varma: ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ సినిమాకు బ్రేక్.. అసలు విషయం చెప్పిన మేకర్స్..
Prashant Varma, Ranveer Sin
Rajitha Chanti
|

Updated on: May 31, 2024 | 7:17 AM

Share

హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. యంగ్ హీరో తేజ సజ్జా ప్రదాన పాత్రలో నటించిన ఈ మూవీకి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మారుమోగింది. దీంతో ఇప్పుడు ఆయన తెరకెక్కించే హనుమాన్ సెకండ్ పార్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అయితే హనుమాన్ 2 కంటే ముందే ప్రశాంత్ వర్మ రూపొందించే మరో ప్రాజెక్ట్ గురించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో హనుమాన్ డైరెక్టర్ ఓ సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. వీరిద్దరి కాంబోలో వచ్చే ప్రాజెక్టుకు రాక్షస్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారని సమాచారం. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కొద్ది రోజులుగా ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడమే ఇందుకు కారణమని టాక్. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్.

ఇటీవల ఓ ప్రకటనలో రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. “ప్రశాంత్ వర్మ ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అనుకున్నాము. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి సినిమా చేస్తామనే నమ్మకం ఉంది ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పట్లో రాక్షస్ సినిమా రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే విషయం పై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “రణవీర్ సింగ్ ఎనర్జీ, టాలెంట్ దొరకడం చాలా అరుదు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి మేమిద్దరం కలిసి పనిచేస్తాము. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా మేమిద్దరం వేరు అవుతున్నాం. కానీ మా ఇద్దరి నిర్ణయాలు సరైనవే. అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్టును రూపొందించడం సరైనది కాదు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఇద్దరం సహకరిస్తాము” అంటూ చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఇన్నాళ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన రూమర్స్ నిజమే అని తెల్చీ చెప్పారు మేకర్స్. ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ కాంబోలో వచ్చే రాక్షస్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ 2 ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.