AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Nandini Reddy: ఆ హీరో చాలా మంచి వ్యక్తి.. నన్ను అక్క అని పిలుస్తుంటారు.. డైరెక్టర్ నందినీ రెడ్డి..

దర్శకురాలు నందిని రెడ్డి ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా నిర్మాణంలో తన వినూత్న ఆలోచనలను పంచుకున్నారు. కథకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాణిజ్య ఫార్ములాలు బద్దలు కొట్టాలని ఆమె అన్నారు.

Director Nandini Reddy: ఆ హీరో చాలా మంచి వ్యక్తి.. నన్ను అక్క అని పిలుస్తుంటారు.. డైరెక్టర్ నందినీ రెడ్డి..
Nandini Reddy
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2026 | 12:45 PM

Share

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటించగా..బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ హీరోతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు నందినీ రెడ్డి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినిమా నిర్మాణ శైలి, నటీనటులతో తన అనుబంధంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కథకు ప్రాధాన్యత ఇవ్వడం, వాణిజ్య ఫార్ములాలు బద్దలు కొట్టడం వంటి అంశాలపై ఆమె తన ఆలోచనను స్పష్టం చేశారు. నందిని రెడ్డి మాట్లాడుతూ, చాలా మంది నటీనటులు, క్రియేటివ్ పీపుల్ తమకున్న స్టార్ మార్కెట్‌ను దాటి వెళ్లడానికి ఆసక్తి చూపరని అన్నారు. చిన్న కథలే కాకుండా పెద్ద కథలు ఎందుకు రాయకూడదని అడుగుతున్నారని, తనకు పెద్ద కథ దొరికినప్పుడు తప్పకుండా చేస్తానని చెప్పారు. ఒక గొప్ప ఆలోచనతో కూడిన కథ రావాలని ఆమె కోరుకుంటున్నారు.

నందిని రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌తో తన వ్యక్తిగత బంధం గురించి కూడా పంచుకున్నారు. ఎన్టీఆర్ తనను “అక్కా” అని పిలుస్తారని, వారిద్దరికీ సాధారణ స్నేహితుల సర్కిల్ ఉందని ఆమె తెలిపారు. గుణ్ణం గంగరాజు కుటుంబం, రమా, రాజమౌళి వంటి వారితో తాను దర్శకురాలు కాకముందు నుంచే పరిచయం ఉందని, ఆ సర్కిల్స్‌లో ఎన్టీఆర్ కూడా ఉండేవారని నందిని రెడ్డి వివరించారు. డిన్నర్‌ల వంటి సాధారణ సందర్భాలలో కలుసుకునేవారమని చెప్పారు.

ఎన్టీఆర్‌ను చాలా మంచి వ్యక్తిగా, స్నేహపూర్వకంగా, వినయంగా, చాలా ఆప్యాయంగా ఉండే వ్యక్తిగా నందిని రెడ్డి అన్నారు. ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటారని, అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం అని ఆమె పేర్కొన్నారు. “ఆర్ఆర్ఆర్” చిత్రం విడుదలైన తర్వాత తాను ఎన్టీఆర్‌ను కలవలేదని, అయితే రామ్ చరణ్‌ను, కీరవాణిని కలిసి వారి విజయాలను అభినందించానని నందిని రెడ్డి స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

నందినీరెడ్డి, ఎన్టీఆర్.

Nandini Reddy, Jr Ntr

Nandini Reddy, Jr Ntr

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us