Kalki 2: తిరుమల శ్రీవారి సాక్షిగా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD గత సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలాజికల్ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రభాస్ కథానాయకుడిగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితర స్టారాది స్టార్లు ఈ సినిమాలో నటించారు. గతేడాది భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహా భారతంతో పాటు భవిష్యత్తును, పురాణాలను మిళితం చేసి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కాగా కల్కి సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం రెండో పార్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ క్రేజీ సీక్వెల్ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చాడు.తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సమయంలో, కొంతమంది మీడియా వ్యక్తులు అతనిని చుట్టుముట్టారు. కల్కి 2 సినిమా పనులు ఎంతవరకొచ్చాయని అడిగారు. దీనికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా స్క్రిప్ట్ సిద్ధమవుతోందని అన్నారు. కొన్ని నెలల్లో స్క్రిప్ట్ ఫైనల్ అవుతుందని, ఈ ఏడాది చివరి నాటికి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం తాను దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా రీ-రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా కూడా కల్కి 2 పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు నాగ్ అశ్విన్. ‘కల్కి 2’ సినిమాలో ప్రభాస్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని అన్నారు. అంతే కాదు, ఈ చిత్రం ప్రధానంగా కర్ణుడు, అశ్వత్థామ పాత్రల గురించి ఉంటుందన్నాడు. అలాగే కమల్ హాసన్ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుందని పేర్కొన్నాడు.
కల్కి సినిమాకు టీవీల్లోనూ సూపర్ రెస్పాన్స్..
Spotted Bhairava? He’s chilling at Khaitalapur Flyover. Tag us when you see him! 🔥
Kalki Watch & Win: 🔗https://t.co/sURDvRNee8
World Television Premiere #Kalki2898AD Tomorrow 5:30Pm, Only on #ZeeTelugu#SpotBhairavaInHyderabad #Kalki2898ADWatchandWinContest… pic.twitter.com/WLSsqDqr34
— ZEE TELUGU (@ZeeTVTelugu) January 11, 2025
ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అతను హను రాఘవపూడి సినిమాతో బిజీ కానున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలను కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. వీటి తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాలోనూ డార్లింగ్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. హోంబాలే సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.