AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Maruthi : ఆ సినిమా ఆడదు.. లైట్ తీసుకో అన్నారు.. అందుకే ప్రమోషన్స్ చేయలేదు.. కానీ.. బ్లాక్ బస్టర్ హిట్టైంది.. డైరెక్టర్ మారుతి..

డైరెక్టర్ మారుతి సినిమాల గురించి చెప్పక్కర్లేదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోస్ కాకుండా కథను ప్రాధానంగా ఎంచుకుని తనకంటూ వరుస హిట్స్ అందుకున్నారు. సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తన కెరీర్ లో వచ్చిన ఓ సినిమా హిట్ కాదని ముందే ఊహించి ప్రమోషన్స్ లైట్ తీసుకున్నానని.. కానీ ఆ మూవీ భారీ విజయాన్ని సాధించిందని చెప్పుకొచ్చారు.

Director Maruthi : ఆ సినిమా ఆడదు.. లైట్ తీసుకో అన్నారు.. అందుకే ప్రమోషన్స్ చేయలేదు.. కానీ.. బ్లాక్ బస్టర్ హిట్టైంది.. డైరెక్టర్ మారుతి..
Maruthi
Rajitha Chanti
|

Updated on: Apr 09, 2026 | 12:14 PM

Share

ఇటీవలే ప్రభాస్ హీరోగా రాజాసాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు డైరెక్టర్ మారుతి. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి … ప్రేమ కథా చిత్రమ్ చిత్రం విజయం, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఈ రోజుల్లో పెద్ద బడ్జెట్ చిత్రాలకే కలెక్షన్లు వస్తున్నప్పటికీ, చిన్న బడ్జెట్‌లో ప్రేమ కథా చిత్రమ్ సాధించిన విజయం, అది ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారిన తీరు చర్చనీయాంశమైంది. తన మొదటి, రెండవ చిత్రాలతోనే ఈ గుర్తింపు రావడంపై మారుతి స్పందించారు. తనకు ట్రెండ్ సెట్టర్ అనే ఇమేజ్ గురించి అంతగా తెలియదని, తాను కేవలం తనకు తెలిసిన సినిమాను తీశానని మారుతి వినయంగా చెప్పారు. ఆ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు, ముఖ్యంగా సాధారణ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని, తన చిత్రాలు సహజంగా ఉంటాయని వారు భావించారని ఆయన పేర్కొన్నారు. అందుకే కుటుంబాలు, మహిళలు వంటి వారు తన సినిమాలు చూడటానికి ఆసక్తి చూపారని మారుతి వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

ప్రేమ కథా చిత్రమ్ సినిమా ఎంత భయపెడుతుందో అంతే కామెడీగా ఉంటుందని, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని మారుతి అన్నారు. ఈ చిత్రం చేసినప్పుడు అది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే సందేహం కలిగిందని తెలిపారు. జీవితంలో కొన్ని ప్రయోగాలు చేయాలని, అప్పుడే కొత్తదనం ఉంటుందని తాను నమ్మినట్లు తెలిపారు. ఈ చిత్రం ఒక ప్రయోగాత్మక చిత్రమని, కేవలం కామెడీ చేస్తే దెయ్యం ఎటకారమైపోతుందని, అలాగే పూర్తిగా దెయ్యం సినిమాగా చూస్తే తక్కువ మంది ప్రేక్షకులకే నచ్చుతుందని (సుమారు 7 శాతం మంది మాత్రమే) ఆయన వివరించారు. దెయ్యం సినిమా అని పోస్టర్ వేస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనుకాడతారని, అందుకే తాను ప్రేమ కథా చిత్రమ్ను దెయ్యం సినిమాగా ఎక్కడా ప్రొజెక్ట్ చేయలేదని మారుతి తెలిపారు. దీనికి ప్రేమ కథా చిత్రమ్ అని టైటిల్ పెట్టి, ఒక లవ్ స్టోరీగా చూపించాలనుకున్నానని, హారర్‌ను కేవలం బ్యాక్‌డ్రాప్‌గా ఎంచుకున్నానని, చివరికి అదే జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

ఈ సినిమా అంత పెద్ద హిట్ అయినప్పటికీ, ప్రారంభంలో తనకు దానిపై నమ్మకం లేదని మారుతి వెల్లడించారు. తాను తన స్నేహితులకు ఈ కథను చూపించినప్పుడు, “ఈ సినిమా ఆడదు, నీకు రెండు పెద్ద హిట్లు ఉన్నాయి, నా మాట విని నీ పేరు పక్కన పెట్టేసి, కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి పేరు వేసేయ్” అని సలహా ఇచ్చి తనను బాగా నిరుత్సాహపరచారని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను కూడా కొంత భయపడ్డానని, సినిమా నిజంగా ఆడుతుందని, ఇంత పెద్ద హిట్ అవుతుందని కలలో కూడా ఊహించలేదని మారుతి అన్నారు. సినిమా హిట్ అయ్యాక తన స్నేహితులు కూడా షాక్ అయ్యారని, వాళ్ళు కూడా సినిమా చూసి కొనుక్కుందామని అనుకున్నారని, కానీ అప్పటి పరిస్థితి చూసి ఇది ఆడేట్టుగా లేదని భావించారని ఆయన తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

Follow Us
ఇంకెన్ని చూడాలి సర్.. ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య
ఇంకెన్ని చూడాలి సర్.. ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య
ఏంటి మేడమ్.. ఇది మీరేనా! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఏంటి మేడమ్.. ఇది మీరేనా! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి
భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి
ఏ బ్రాంచి బెటర్‌ బ్రో.. EAPCET 2026 కౌన్సెలింగ్‌లో గజిబిజీ!
ఏ బ్రాంచి బెటర్‌ బ్రో.. EAPCET 2026 కౌన్సెలింగ్‌లో గజిబిజీ!
ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆమీర్ ఖాన్.. కారణం ఏంటో తెలుసా..
ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆమీర్ ఖాన్.. కారణం ఏంటో తెలుసా..
కుటుంబాలతో కలిసి చూసే ఆటలో అడల్ట్ యాడ్స్ అవసరమా?
కుటుంబాలతో కలిసి చూసే ఆటలో అడల్ట్ యాడ్స్ అవసరమా?
పూజలో అగరబత్తులు ఎందుకు వెలిగిస్తారు? ఆధ్యాత్మిక, శాస్త్రీయ..
పూజలో అగరబత్తులు ఎందుకు వెలిగిస్తారు? ఆధ్యాత్మిక, శాస్త్రీయ..
ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం..
ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం..
ఇంట్లో పెద్దవాళ్ల నడుం బలానికి పుష్టినిచ్చే నల్ల కారం.. భలే రుచి
ఇంట్లో పెద్దవాళ్ల నడుం బలానికి పుష్టినిచ్చే నల్ల కారం.. భలే రుచి
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!