
పైన ఫోటోలో మోడ్రన్ డ్రెస్, చీరకట్టులో కనిపిస్తున్న ఆ అమ్మాయి స్టార్ డైరెక్టర్ కూతురు. అందంలో హీరోయిన్లను మించి పోయిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటుంది. అచ్చం హీరోయిన్గా కనిపిస్తున్న ఈ అమ్మాయి దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడి గారాలపట్టి. ఇంతకీ అతడు ఎవరో తెలుసా. ? అతడు మరెవరో కాదు.. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ కే.ఎస్ రవికుమార్ గారాలపట్టి జస్వంతి రవికుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ముత్తు, నరసింహా సినిమాలకు డైరెక్టర్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇవే కాకుండా కమల్ హాసన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ దశావతారం సినిమాను సైతం ఆయనే తెరకెక్కించారు.
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాలను రూపొందించారు రవికుమార్. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం, బావనచ్చాడు, జై సింహా, రూలర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు రవికుమార్. దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా ఇలా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు కే.ఎస్ రవికుమార్. దశాబ్దాలుగా సినీరంగంలో నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు అగ్ర హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన రవికుమార్.. ఈమధ్య కాలంలో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆడపా దడపా చిత్రాలను రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా రవికుమార్ కూతురు జస్వంతి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. హీరోయిన్లను మంచిన అందంతో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే జస్వంతి సినీరంగానికి దూరంగా ఉంటుంది. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్, హీరో అర్జున్ తనయ ఐశ్వర్య సైతం హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ డైరెక్టర్ రవికుమార్ కూతురు జస్వంతి మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..