AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghavendra Rao: వాళ్లతో కలిసి పనిచేస్తుంటే వయసు గుర్తుకు రాదు.. డైరెక్టర్ రాఘవేంద్రరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సందర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ జ‌రిగింది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న డైరెక్టర్ రాఘవేంద్రరావు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Raghavendra Rao: వాళ్లతో కలిసి పనిచేస్తుంటే వయసు గుర్తుకు రాదు.. డైరెక్టర్ రాఘవేంద్రరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Raghavendra Rao
Rajitha Chanti
|

Updated on: May 30, 2022 | 9:47 AM

Share

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మిస్తున్న చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఇందులో సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటిస్తుండగా.. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సందర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ జ‌రిగింది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న డైరెక్టర్ రాఘవేంద్రరావు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఎంట‌ర్‌టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి క‌థ నాకు వినిపించారు. హిలేరియ‌స్‌గా అనిపించింది. నిజానికి త‌నికెళ్ల భ‌ర‌ణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామ‌ని అనుకున్నారు. పెళ్లి సంద‌D సినిమాకు శ్రీధ‌ర్ సీపాన అద్భుత‌మైన డైలాగ్స్‌ను అందించాడు. దాంతో త‌నే వాంటెడ్ పండుగాడ్ సినిమాను డైరెక్ట్ చేస్తే బావుంటుంద‌నిపించింది. పి.ఆర్ సంగీతం, మ‌హి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తుంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. వీళ్లంద‌రితో క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్ల నాకు వ‌య‌సు గుర్తుకు రాదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌. జూన్ చివ‌రి వారం లేదా జూలై తొలి వారంలో ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

సునీల్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో పండు పాత్ర‌లో న‌టించాను. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించే సినిమా. ఫ్యామిలీ అంతా తెగ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!