Pelli Sandadi 2: ఆ రోజునే దర్శకేంద్రుడి కొత్త పెళ్లి ‘సందడి’ మొదలయ్యేది..  డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. 

Pelli Sandadi 2 Movie Update: టాలీవుడ్ దర్శకేంద్రుడు పాతిక సంవత్సరాల క్రితం తెరకెక్కించిన చిత్రం పెళ్లిసందడి.

Pelli Sandadi 2: ఆ రోజునే దర్శకేంద్రుడి కొత్త పెళ్లి సందడి మొదలయ్యేది..  డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. 
Raghavendra Rao

Updated on: Apr 27, 2021 | 9:16 AM

Pelli Sandadi 2 Movie Update: టాలీవుడ్ దర్శకేంద్రుడు పాతిక సంవత్సరాల క్రితం తెరకెక్కించిన చిత్రం పెళ్లిసందడి. ఇందులో శ్రీకాంత్, రవలి, దీప్తీ భట్నగర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు అదే మూవీ పేరుని మరోసారి తలపిస్తూ.. పెళ్లిసంద..దీ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తుండగా.. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

 

శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. అయితే ఈ సినిమాలోని పాటను ఈనెల 28న విడుదల చేయనున్నట్లుగా సమాచారం. దర్శకేంద్రుడికి ఏప్రిల్ 28న ఓ ప్రత్యేకత ఉంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అడవిరాముడు విడుదలైనది ఆరోజే. ఆయన సమర్పణలో రూపొందిన బాహుబలి ది కన్ క్లూజన్ విడుదలైందీ కూడా అదే రోజు. అందుకే పెళ్లిసంద..డి పాటను ఆరోజున విడుదల చేయాలని నిర్ణయించాయి సినీ వర్గాలు.  ‘ఇది కొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రం. నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదు. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ నెల 28న విడుదల కానున్న పాటతో కె.రాఘవేంద్రరావు – కీరవాణి స్వరాల సందడి మళ్లీ మొదలవుతుంద’’ని సినీ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

Also Read: ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. పూడ్చ‌లేని న‌ష్టమిది.. ఎలా అధిగమించాలో తెలియ‌డం లేదు అంటూ ట్వీట్..

సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం… పూజా హెగ్డేకు కోవిడ్ పాజిటివ్.. క్వారంటైన్‏లో బుట్టబొమ్మ..

Daggubati Abhiram: అన్న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే లాంచ్ కానున్న అభిరామ్‌..? ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్‌..

Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్న సూప‌ర్ స్టార్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్ బాబు..