Drishyam Movie: దృశ్యం-3 రానుందా..? క్లైమాక్స్‌ డిసైడ్‌ అయ్యిందా.? దర్శకుడు ఏం చెప్పాడంటే..

|

Feb 26, 2021 | 7:42 PM

planning for drishyam-3 movie: కథలో కంటెంట్‌ ఉండాలే కానీ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అని చెప్పడానికి దృశ్యం సినిమా ప్రత్యక్ష ఉదాహరణ. మలయాళంలో తెరకెక్కిన ఓ సినిమా దక్షిణాది అన్ని భాషలతో పాటు..

Drishyam Movie: దృశ్యం-3 రానుందా..? క్లైమాక్స్‌ డిసైడ్‌ అయ్యిందా.? దర్శకుడు ఏం చెప్పాడంటే..
Follow us on

planning for drishyam-3 movie: కథలో కంటెంట్‌ ఉండాలే కానీ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అని చెప్పడానికి దృశ్యం సినిమా ప్రత్యక్ష ఉదాహరణ. మలయాళంలో తెరకెక్కిన ఓ సినిమా దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలోనూ సూపర్‌ హిట్‌ అయ్యిందంటేనే కథలో ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగులో వెంకటేష్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలోకి ఓ వ్యక్తి రావడంతో వారి జీవితం ఎలా మారిపోయిందన్న చిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం భారతీయ భాషలకే పరిమితం కాకుండా చైనీస్‌ భాషలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే మలయాళంలో ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా అమేజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అన్ని భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగులో వెంకీ ఈ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించి ఫొటోలు సైతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక హిందీలోనూ ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించనున్నట్లు నిర్మాత ప్రకటించారు. అయితే హిందీలో దృశ్యం సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు.. నిషికాంత్‌ కామంత్‌ గతేడాది అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ సీక్వెల్‌కు మలయాళ దర్శకుడు జీతూ సోసెఫ్‌ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అయితే మిగత తారలంతా వారే ఉండనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రెండు పార్ట్‌లు విజయవంతం కావడంతో మరో పార్ట్‌.. అంటే దృశ్యం-3ని కూడా తెరకెక్కించనున్నట్లు దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెలిపాడు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించాడు. కేవలం ప్రకటించడమే కాకుండా.. ఇప్పటికే మూడో భాగం క్లైమాక్స్‌ను కూడా రాసుకున్నాడట.. కానీ సినిమా తెరకెక్కించడానికి మాత్రం మూడేళ్లు సమయం పడుతుందని చెప్పడం గమనార్హం. సీక్వెల్‌ తెరకెక్కించడానికి మూడేళ్ల సమయం ఎందుకున్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే హిందీలో సీక్వెల్‌కు జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తుండడంతో ఆ సినిమా పూర్తి అయిన తర్వాత మూడో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడని అందుకే మూడేళ్ల సమయం పట్టనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే చిత్ర దర్శకుడు అధికారికంగా ప్రటించాల్సి ఉంది. మరి రెండు పార్ట్‌లలో సస్పెన్స్‌ కొనసాగించిన దర్శకుడు.. మూడో పార్ట్‌లోనైనా సప్పెన్స్‌ రిలీవ్‌ చేస్తాడో చూడాలి.

Also Read: Priya prakash varrier : ఆ హీరో సరసన ఛాన్స్ వస్తే వదిలేది లేదంటున్న నితిన్ హీరోయిన్..

పాన్ ఇండియా స్టార్‌‌‌‌‌డమ్‌‌‌ను కంటిన్యూ చేస్తున్న ప్రభాస్… రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉందిగా.. !!

Check Movie : రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన నితిన్ ‘చెక్‌’.. మూవీ ఎలా ఉందంటే..