పాన్ ఇండియా స్టార్‌‌‌‌‌డమ్‌‌‌ను కంటిన్యూ చేస్తున్న ప్రభాస్… రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉందిగా.. !!

అప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తూవచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో తన రేంజ్ మార్చుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో

పాన్ ఇండియా స్టార్‌‌‌‌‌డమ్‌‌‌ను కంటిన్యూ చేస్తున్న ప్రభాస్... రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉందిగా.. !!
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 26, 2021 | 6:52 PM

Prabhas : అప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తూవచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో తన రేంజ్ మార్చుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి సినిమా దేశాలు దాటి మనోడి క్రేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఏకంగా జపాన్ నుంచి ప్రభాస్ ను చూడటాన్ని ఫ్యాన్స్ హైదరాబాద్ వచ్చేంతగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆతర్వాత సుజిత్ తెరకెక్కించిన ‘సాహో’ సినిమా కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా  తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచిన బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం బాగానే ఆదరించారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలను ఓకే చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్.

వీటిలో రాధాకృష్ణ తెరకెక్కించిన ‘రాధేశ్యామ్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ లాంటి సంచలన సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీలతో సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటిసారి ఈ భామ డార్లింగ్ తో జతకడుతుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె  హీరోయిన్ గా నటిస్తుంది.

ఇలా వరుసగా భారీ సినిమాలను పట్టాలెక్కిస్తూ.. దూసుకుపోతున్న డార్లింగ్ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నాడని తెలుస్తుంది.   ఒక్కో సినిమాకు మినిమమ్‌ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట ఈ రెబల్ స్టార్.  సౌత్‌ గడ్డపై ఇంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది కూడా మన ప్రభాసే నట. 100 కోట్ల రెమ్యునరేష్ బాలీవుడ్‌లో వెరీ కామన్‌.. బాలీవుడ్ ను ఏలుతున్న త్రి ఖాన్‌లు ఈ రేంజ్‌ పైకం ఎప్పటినుంచో తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా వాళ్ల సరసన చేరిపోయాడని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.! అడవిలో అన్నగా చిరు..! మారేడుమిల్లిలో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ సందడి….

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?