
ప్రస్తుతం కేరళ బాక్సాఫీస్ వద్ద 2018 చిత్రం దూసుకెళ్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండానే అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులోకి రాబోతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను మే 26న టాలీవుడ్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఇందులో డైరెక్టర్ హరీశ్ శంకర్ పాల్గొన్నారు. అయితే 2018 సినిమా ప్రెస్ మీట్ వేదికగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పారు దర్శకుడు హరీశ్ శంకర్. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోందని ఆయన అన్నారు.
ఈ ప్రెస్ మీట్ క్యూ అండ్ ఏ సెషన్లో భాగంగా ఓ విలేకరి మాట్లాడుతూ.. ‘2018’ సినిమా చూసిన తర్వాత తెలుగు దర్శకులు ఇలాంటి ప్రాజెక్ట్ చేయగలరా ? తెలుగు నిర్మాతలు సాహసం చేయగలరా? అని మీకు అనిపించిందా ? అని ప్రొడ్యూసర్ బన్నీ వాసుని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన బన్నీవాసు.. ఈ ప్రశ్నకు దర్శకుడు హరీశ్ శంకర్ ఆన్సర్ ఇస్తే బాగుంటుందని అంటూ హరీశ్ కు మైక్ అందించారు. ఈ ప్రశ్నపై డైరెక్టర్ స్పందిస్తూ.. సదరు విలేకరిని ఉద్దేశిస్తూ.. ప్రెస్ మీట్స్ జరిగిన ప్రతిసారీ ఆయన ఎవరూ అడగని సాహసోపేతమైన ప్రశ్నలు అడిగి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచి.. యూట్యూబ్ లో ఓ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాను ప్రపంచ సినిమా మన చేతికి వచ్చేసిందని అన్నారు.
ప్రపంచం మొత్తం మనవైపు చూస్తుంది. అలాంటి టెక్నాలజీలో మనం ఉన్నాం. దీనిని డబ్బింగ్ సినిమా అంటున్నారు. మరీ..ఆర్ఆర్ఆర్, బహుబలి చిత్రాలను హిందీలో రిలీజ్ చేస్తే ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా ?.. అనుకోలేదు కదా. డబ్బింగ్ లేదా రీమేక్ సినిమా అనేద లేదు. కేవలం సినిమా అంతే.. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమా ఎక్కడికైనా వెళ్తున్నందుకు ఎంతో సంతోషించాలి. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్న్పపుడు మీరు ఇలాంటి ప్రశ్న వేశారంటే జాలిగా ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు దర్శకుల వైపు చూస్తోంది. ఆయన కేరళ దర్శకుడని నేను ఈ సినిమా చూడలేదు. ఆయన వర్క్ నాకు నచ్చిందని చూసి.. ఆయనను మెచ్చుకుందామని ఇక్కడికి వచ్చాను.
ఇక గీతాఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైపోతుందా ? అని ప్రశ్నిస్తున్నారు కదా.. వరుసగా 100 డబ్బింగ్ సినిమాలు బన్నీ వాసుతో నేనే రిలీజ్ చేయిస్తా. అందులో తప్పేంటి ? ఒక మంచి సినిమాను పది మందికి చూపించాలని చేసే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. విలేకరులకు సినిమా నచ్చితే మీరే ప్రమోషన్ చేస్తారు. డబ్బింగ్ లేదా రీమేక్ కాకుండా.. సినిమాలు చేస్తున్నామా లేదా ? అనేది ముఖ్యం. భాషాపరమైన వ్యత్యాసాలు లేవు.. సినిమా అంటేనే ఒక భాష.. అదే ఒక ఎమోషన్ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
చులకన చేసే నోరు ఉన్నపుడు
చురకలు వేసే నోరు కూడా ఉంటుంది..
Can’t take insult to our industry. By all means please appreciate every film maker from every industry but for that sake don’t belittle our industry.
Whole world is looking towards us. https://t.co/l5yZRZZgjZ
— Harish Shankar .S (@harish2you) May 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.