AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వరుస ఫ్లాప్‌లలో ఉన్న శ్రీకాంత్‌కు హిట్ ఇచ్చా.. ఆ రోజు రాత్రి చిరంజీవి ఏం చేశారంటే.?

దర్శకుడు చంద్ర మహేష్ ప్రేయసి రావే చిత్రం విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి అందించిన మద్దతును గుర్తుచేసుకున్నారు. శ్రీకాంత్‌కు హిట్స్ లేని సమయంలో చిరంజీవి సినిమా చూసి అభినందించడమే కాకుండా, తన ఇంట్లో డిన్నర్‌కు పిలిచి.. కొత్త డైరెక్టర్ మహేష్‌ను ప్రోత్సహించారట. ఆ వివరలు ఇలా ఉన్నాయి.

Tollywood: వరుస ఫ్లాప్‌లలో ఉన్న శ్రీకాంత్‌కు హిట్ ఇచ్చా.. ఆ రోజు రాత్రి చిరంజీవి ఏం చేశారంటే.?
Telugu News
Ravi Kiran
|

Updated on: Jan 22, 2026 | 1:29 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేయసి రావే చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా విజయం తర్వాత, మెగాస్టార్ చిరంజీవి నుంచి చిత్ర బృందానికి, ముఖ్యంగా దర్శకుడు చంద్ర మహేష్‌కు పూర్తీ మద్దతు లభించిందని.. స్వయంగా డైరెక్టరే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీకాంత్‌కు వరుస పరాజయాలు ఎదురైన సమయంలో ప్రేయసి రావే పెద్ద హిట్ అయ్యింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు సినిమాను చూసి, కొత్త దర్శకుడు చంద్ర మహేష్ అద్భుతంగా తీశారని ప్రశంసించారట. వెంటనే చిరంజీవి శ్రీకాంత్‌కు ఫోన్ చేసి, సినిమా చూడాలని.. ప్రివ్యూ ఏర్పాటు చేయమన్నారట. ఆ రోజు రామానాయుడు ఢిల్లీలో ఉండటంతో, దర్శకుడు చంద్ర మహేష్.. డిస్ట్రిబ్యూటర్ భాస్కర్, ప్రొడక్షన్ మేనేజర్‌లతో మాట్లాడి ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేశారు.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

ప్రీవ్యూకు చిరంజీవి తన కుటుంబంతో పాటు, దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ కూడా తన కుటుంబంతో హాజరయ్యారు. శ్రీకాంత్ అప్పుడు క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రం షూటింగ్‌లో నానక్రామ్‌గూడ స్టూడియోలో ఉన్నారు. సినిమా ముగిసిన తర్వాత చిరంజీవి రెండు మూడు నిమిషాలు మౌనంగా కూర్చుని, ఆపై లేచి శివాజీ రాజా నటనను మెచ్చుకుంటూ, ఈ అద్భుతమైన సినిమాను ఎవరు డైరెక్ట్ చేశారని ప్రశ్నించారట. పక్కనున్నవారు చంద్ర మహేష్ అని చెప్పగా, చిరంజీవి ఆయనను ఆత్మీయంగా కౌగిలించుకుని అభినందించారు. “తమ్ముడు, ఏం తీశావు ఈ సినిమా, బ్రహ్మాండంగా తీశావు. ఇది నీ మొదటి సినిమా అంటే నమ్మలేకపోతున్నాను” అంటూ ప్రశంసించారు. చిరంజీవి తన కారు డ్రైవర్‌ను పంపేసి, చంద్ర మహేష్‌ను తన పక్కన కూర్చోబెట్టుకొని, రాజా రవీంద్ర, శివాజీ రాజాలతో కలిసి శ్రీకాంత్ ఉన్న సెట్‌కు వెళ్ళారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..

అక్కడ ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరుల సమక్షంలో శ్రీకాంత్‌ను అభినందించారు. ఆ తర్వాత అందరినీ తన ఇంటికి పిలిచి డిన్నర్ ఇచ్చారు. చిరంజీవి స్వయంగా మహేష్‌కు వడ్డించడం గమనార్హం. అప్పుడు చిరంజీవి “మహేష్, మంచి కథ రాసుకో, సినిమా చేద్దాం” అని ప్రోత్సహించారట. చిన్న సినిమాలకు సైతం ఆయన ఇచ్చే మద్దతు అద్భుతమని దర్శకుడు చంద్ర మహేష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రేయసి రావే చిత్రం విడుదల తర్వాత కొన్ని విమర్శలు ఎదుర్కొంది. “రావే రావే” అనే టైటిల్‌పై మహిళా సంఘాల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టైటిల్‌పై వచ్చిన విమర్శలకు, ఒక భగ్న ప్రేమికుడి కోణం నుంచి కథను చూసిన తర్వాత ప్రేక్షకులు అర్థం చేసుకున్నారని తెలిపారు.

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..