AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paruthiveeran Movie Issue: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. నిర్మాతపై మండిపడ్డ డైరెక్టర్ భారతీ రాజా.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ట్వీట్..

పరుత్తివీరన్ సినిమా విషయంలో డైరెక్టర్ అమీర్ ఎక్కువగా ఖర్చు చేశాడని.. తన అవసరాలకు వాడుకున్నాడని.. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ చేశాడని.. కావాలనే ఇలా డబ్బును ఉపయోగించాడంటూ నిర్మాత జ్ఞానవేల్ ఆరోపించాడు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకుడు అమీర్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే సినీ నిర్మాత శశికుమార్, నటుడు సముద్రఖని, సుధా కొంగర, నటుడు పొన్వన్నన్ తదితరులు అమీర్‌కు మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు దర్శకుడు భారతీ రాజా సైతం అమీర్‏కు సపోర్ట్ చేస్తూ ఓ నోట్ షేర్ చేశారు.

Paruthiveeran Movie Issue: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. నిర్మాతపై మండిపడ్డ డైరెక్టర్ భారతీ రాజా.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ట్వీట్..
Bharathi Raja
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2023 | 10:27 AM

Share

తమిళ్ సినీ పరిశ్రమలో కొద్ది రోజులుగా డైరెక్టర్ అమీర్, నిర్మాత జ్ఞానవేల్ మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కార్తీ నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్ సినిమా బడ్జెట్ గురించి తలెత్తిన ఈ వివాహం రోజు రోజుకూ మరింత ముదురుతోంది. ఇప్పుడు వీరిద్దరి టాపిక్ కోలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్. కొన్నిరోజుల క్రితం పరుత్తివీరన్ సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ జ్ఞానవేల్ డైరెక్టర్ అమీర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. పరుత్తివీరన్ సినిమా విషయంలో డైరెక్టర్ అమీర్ ఎక్కువగా ఖర్చు చేశాడని.. తన అవసరాలకు వాడుకున్నాడని.. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ చేశాడని.. కావాలనే ఇలా డబ్బును ఉపయోగించాడంటూ నిర్మాత జ్ఞానవేల్ ఆరోపించాడు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకుడు అమీర్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే సినీ నిర్మాత శశికుమార్, నటుడు సముద్రఖని, సుధా కొంగర, నటుడు పొన్వన్నన్ తదితరులు అమీర్‌కు మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు దర్శకుడు భారతీ రాజా సైతం అమీర్‏కు సపోర్ట్ చేస్తూ ఓ నోట్ షేర్ చేశారు.

“జ్ఞానవేల్.. నేను మీరు మాట్లాడిన వీడియో చూశాను. పరుత్తివీరన్ సినిమాపై మీరు ఆర్థిక సమస్యలు ఉన్నాయి.. కానీ నువ్వు ఒక గొప్ప క్రియేటర్‏ను, అతడి పేరును, ప్రతిష్టను, కృషిని దిగజార్చేలా మాట్లాడటం ఖండించాల్సిన విషయం. ఈ సినిమా విషయంలో అమరీ పాత్ర చాలా పెద్దదని మర్చిపోవద్దు. పరుత్తివీరన్ కంటే ముందు డైరెక్టర్ అమీర్ రెండు సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించారు. కానీ మీ సినిమాతోనే పని నేర్చుకున్నాడు.. సంపాదించాడు అని చెప్పడం నాలంటి క్రియేటర్లను అవమానించడమే. ఎందుకంటే నిజమైన క్రియేటర్స్ చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఒక గొప్ప క్రియేటర్, అతడి పనిని, చిత్తశుద్ధిని అవమానించినందుకు నువ్వు అతడికి క్షమాపణలు చెప్పాల్సిందే. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడం మంచిదని భావిస్తున్నాను” అంటూ ప్రకటన విడుదల చేశారు భారతీ రాజా.

మరోవైపు డైరెక్టర్ కుర.పళనియప్పన్ సైతం అమీర్ కు మద్దతుగా నిలిచారు. అలాగే సూర్య, కార్తీ తండ్రి శివకుమార్ మాట్లాడుతూ.. డైరెక్టర్ అమీర్ కు నిర్మాత జ్ఞానవేల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ సినిమా మధ్యలోనే నిర్మాత చేతులెత్తేస్తే అమీర్ తన సొంత డబ్బుతో సినిమా తీశాడని.. నటీనటులు కూడా కొంత డబ్బు సాయం చేశామని.. అంత కలిసి సినిమాను పూర్తి చేశామని.. చివరకు వచ్చి నిర్మాతగా నీ పేరు వేసుకున్నావంటూ జ్ఞానవేల్ పై నటుడు సముద్రఖని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్