
‘సర్దార్ జీ 3’.. ఈ పంజాబీ సినిమా ఓవర్సీస్‌లో రూ. 64 కోట్లు రాబట్టింది. అలాగే పాకిస్తాన్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ హయ్యస్ట్ గ్రోసర్‌గా నిలిచింది. ఇండియాలో ఈ చిత్రం విడుదల కాలేదు. ఇంకా చెప్పాలంటే బ్యాన్ అయినట్టే. ఎన్నో వివాదాలకు దారి తీసిన ఈ సినిమా ఎందుకు ఇండియాలో బ్యాన్ అయిందో ఇప్పుడు తెలుసుకుందామా.. దిల్జిత్ దోసాంజ్, నీరూ బాజ్వా ప్రధాన పాత్రల్లో అమర్ హండల్ డైరెక్ట్ చేసిన ‘సర్దార్ జీ 3’ సినిమాలో పాకిస్థానీ నటి హానియా అమీర్ కీలక పాత్ర పోషించింది. ఇక ఇదే అసలు వివాదానికి కారణమైంది. పాకిస్తాన్ నటి ఈ చిత్రంలో నటించడం వల్లే.. ఈ మూవీను ఇండియాలో రిలీజ్ చేయవద్దని డిమాండ్లు వెల్లువెత్తాయి. చివరికి భారత్‌లో బ్యాన్ అయ్యి.. ఓవర్సీస్‌లో హిట్ కొట్టింది.
2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఎటాక్ తర్వాత ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్’ భారత సినిమాల్లో పాకిస్తానీ నటీనటులు నటించడంపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేసింది. అయితే ‘సర్దార్ జీ 3’లో పాకిస్తాన్ నటి హానియా అమీర్ నటించడంతో భారత్‌లో ఈ మూవీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే భారత ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ.. నిర్మాతలు మూవీను కేవలం ఓవర్సీస్‌లో మాత్రమే రిలీజ్ చేసింది. నటించటంతో ఇండియాలో మూవీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ.. నిర్మాతలు భారత్‌లో కాకుండా కేవలం ఓవర్సీస్ మార్కెట్లలోనే దీన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ మూవీ ఓవర్సీస్‌లో హయ్యస్ట్ కలెక్షన్లు నమోదు చేసిన పంజాబీ సినిమాగా నిలిచింది. అలాగే పాకిస్థాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి