Allu Arjun : అల్లుఅర్జున్ ఐకాన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా సంచలన విజయాన్ని సొంతంచేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది.

Allu Arjun : అల్లుఅర్జున్ ఐకాన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 19, 2021 | 6:02 AM

Allu Arjun పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా సంచలన విజయాన్ని సొంతంచేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇక దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను వెండి తెరపైన చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి శ్రీరామ్ కు వరుస అవకాశాలు క్యూ కడతాయి. అయితే వకీల్ సాబ్ సినిమాకంటే ముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను కన్ఫామ్ చేసాడు వేణు శ్రీరామ్. ఈ మూవీకి ఐకాన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను కూడా పెట్టేసాడు.

వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అలాగే  ఐకాన్ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఇటీవల్ ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా దిల్ రాజు ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. యుటీవీల ఓ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఐకాన్’ అనే విషయాన్ని తేల్చి చెప్పాడు. ‘ఐకాన్’ నాకు బాగా నచ్చిన కథ .. పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉంది కనుక, వెంటనే ఈ సినిమాను మొదలెట్టబోతున్నామని స్పష్టం చేశాడు.’పుష్ప’ తరువాత బన్నీ చేయనున్న సినిమా ఇదేననే విషయంలో క్లారిటీ వచ్చేసింది. అంటే ‘ఐకాన్ స్టార్’ అనే బిరుదు వచ్చేసిన తరువాత బన్నీ చేయనున్న సినిమా కూడా ఇదే. మరో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

RIP Vivek: మరో నవ్వుల రారాజును కోల్పోయిన వెండితెర.. 35 ఏళ్లకు పైగా సినిమానే జీవితంగా బ్రతికిన కామెడీ కింగ్

Priyaprakh Warrier: ప్రియా.. క‌న్ను కొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..

నాకు న్యాయం చేయండి.. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్..