AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు ఫుడ్ సర్వర్‏గా పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలన హీరోయిన్.. ఎవరంటే..

సినీరంగుల ప్రపంచంలో స్టార్ హీరోహీరోయిన్లుగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు.. సవాళ్లు, అవమానాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవకాశాల కోసం నిత్యం వందలాది మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు.

Tollywood: ఒకప్పుడు ఫుడ్ సర్వర్‏గా పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలన హీరోయిన్.. ఎవరంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Oct 13, 2024 | 6:17 PM

Share

సినీరంగుల ప్రపంచంలో స్టార్ హీరోహీరోయిన్లుగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు.. సవాళ్లు, అవమానాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవకాశాల కోసం నిత్యం వందలాది మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరైన వారు సినిమాల్లోకి రాకముందు తాము ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతుంటారు. పెద్ద ఉద్యోగాలు వదిలి సినిమాల్లోకి వచ్చినవారు కొందరు.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ సినిమాల్లోకి అవకాశాలు అందుకున్నవారు మరికొందరు. నిజానికి ఎన్నో కష్టాలను అధిగమించి ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు చాలా మందికి ఆదర్శం. ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలన హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ఓ అమ్మాయి.. ఒకప్పుడు పెళ్లి వేడుకలలో ఫుడ్ సర్వర్ గా పనిచేసింది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలు చవిచూసిన ఈ భామ నేడు బాలీవుడ్ అగ్రనటి. ఆమె బాలీవుడ్ బ్యూటీ రాకీ సావంత్. బాలీవుడ్ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న నటి.

ఈ బ్యూటీ సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాల్లో నటించడమే కాకుండా స్పెషల్ పాటలకు డ్యాన్స్ చేయడం రాకీ ప్రధాన కెరీర్. రాఖీ సావంత్ 1978 నవంబర్ 25న ముంబైలో జన్మించింది. ఆమె అసలు పేరు నెహ్రూ బేడా. అతని తండ్రి వర్లీలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. రాకీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఈ విషయాన్ని స్వయంగా తనే అనేక ఇంటర్వ్యూలు, షోలలో ప్రస్తావించారు. రాకీ సావంత్ 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తుంది. ముంబయిలోని ఓ క్యాటరింగ్‌ సర్వీస్‌లో ఫుడ్ సర్వర్ గా పనిచేశానని.. అప్పుడు తనకు రోజుకు రూ.50 వేతనం జీతం ఇచ్చేవారని చెప్పుకొచ్చింది.

తాను సినిమాల్లో నటించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని… కానీ తనకు మాత్రం చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. దీంతో కుటుంబ సభ్యుల వ్యతిరేకతను సైతం లెక్కచేయకుండా సినిమాల్లోకి అడుగుపెట్టానని తెలిపింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సినిమాల్లో నటించాలనే తపనతో ఉన్న రాకీకి నిరాశే మిగిలింది. ఆమె రంగు తక్కువగా ఉండడంతో సినిమాల్లో నటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె తన శరీరం, ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది. చికిత్స తర్వాత రాకీకి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. “అగ్ని చక్రం” సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాకీ, సినిమాల్లో నటిస్తూ, సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ బిజీబిజీగా గడుపింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది రాకీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.