AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ పాప ఇప్పుడు హీరోయిన్.. ఒక్క హిట్ పడితే టాప్ ప్లేస్ పక్కా..

ఈ పాప ఇప్పుడు హీరోయిన్. వరుస సినిమాలు చేస్తోంది. మంచి స్క్రిప్ట్ ఎంపిక చేసుకుంటుంది. అందం, అభినయం ఉన్నా లక్ కలిసి రావట్లేదు. తనెవరో మీరు గుర్తుపట్టారా..?

Tollywood: ఈ పాప ఇప్పుడు హీరోయిన్.. ఒక్క హిట్ పడితే టాప్ ప్లేస్ పక్కా..
Heroine Childhood Photo
Ram Naramaneni
|

Updated on: Oct 13, 2024 | 5:59 PM

Share

ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే.. ఫేమ్, మనీ బోనస్ కింద వస్తాయి. వెండితెర మిమ్మల్ని ఆదరిస్తే మీ లైఫ్ మారిపోయినట్లే. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. హీరోయిన్స్ అయినా సరే.. ఫస్ట్ ఇంపాక్ట్ బాగుంటే… ఒక భాషలో కాకపోతే మరో భాషలో ఇలా అవకాశాలు వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కొంతమంది ఇలా వచ్చి అలా అగ్రతారగా మారిపోతారు. మరికొందరు మాత్రం స్లో అండ్ స్టడీగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు హీరోయిన్‌ను పరిచయం చేయబోతున్నాం. తనకి సరైన బ్రేక్ రాకపోవయిన వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతూ అవకాశాలు ఒడిసి పడుతోంది.

ఫోనులో మాట్లాడుతూ.. ఫోటోకు ఫోజులిస్తున్న ఈ పాప గురించి మేము మాట్లాడేది. తను ఇప్పుడు యాక్ట్రస్. ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఇండిగో ఎయిర్ లైన్స్‌లో పని చేస్తూ వినోద రంగంపై ఆసక్తితో జాబ్ వదిలి పెట్టి.. మోడలింగ్ రంగంలోకి ఎంటరయ్యింది. ఆపై ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందం, అభినయం ఉన్నప్పటికీ.. లక్ కలిసి రాక.. ఇంకా సరైన గుర్తింపు రాలేదు. ఆ బ్యూటీ మరెవరో కాదండోయ్.. రాశీ సింగ్. మొన్నామధ్య సుహాస్ హీరోగా వచ్చిన ప్రసన్నవదనం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. 2016 నుంచి ఇండస్ట్రీలో బ్రేక్ కోసం పరితపిస్తోంది. 2019లో సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన రీసౌండ్ అనే చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ అంతగా వర్కువుట్ అవ్వలేదు. ఆ తర్వాత పోస్టర్, జెమ్ అనే సినిమాల్లో నటించింది. 2021లో వచ్చిన శశి.. మూవీతో కొంచె జనాల దృష్టిలో పడింది.

2023లో యంగ్ టాలెంట్ హీరో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ప్రేమ్ కుమార్ సినమాలో నేత్ర పాత్రలో అలరించింది. కానీ ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇదే సంవత్సరంలో వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్క్స్ పడ్డాయి. పాపం పసివాడు అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది. తర్వాత ప్రసన్నవదనంలో సుహాస్ పక్కన చేసింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్.  తనకు ఒక్క మంచి హిట్ పడితే.. రష్మికను మించిపోయే స్టార్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Rashi Singh (@rashi.real)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు