Tollywood: ఒకప్పుడు లోకల్ న్యూస్‌ ఛానెల్‌ యాంకర్.. ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ నటి.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ లో చాలా మంది కెరీర్ ప్రారంభంలో చిన్న చితకా పనులు చేసిన వారే. పొట్ట కూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వారే. ఈ టాలీవుడ్ ప్రముఖ నటి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

Tollywood: ఒకప్పుడు లోకల్ న్యూస్‌ ఛానెల్‌ యాంకర్.. ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ నటి.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Nov 02, 2025 | 3:27 PM

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. అలాగనీ ఆమె హీరోయిన్ పాత్రలేమీ చేయడం లేదు. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ కు అక్కగా, చెల్లిగా నటిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 25 కు పైగా సినిమాల్లో నటించిన ఈ అందాల తార అభినయం పరంగానూ మంచి గుర్తింపు తెచ్చకుంది. అన్నట్లు ఈ నటిది మన తెలంగాణే. తెలంగాణలోని నిజమాబాద్ లో పుట్టి పెరిగింది. బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత స్థానికంగా ఉండే ఓ లోకల్ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా చేరింది. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా విధులు నిర్వర్తించింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే సినిమా ఇండస్ట్రీ వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. పలు సినిమాల ఆడిషన్స్ కు హాజరైంది. అలా ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపికైంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీలో సాయి పల్లవి అక్కగా అద్భుతంగా నటించిందీ అందాల తార. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆమె నటనా ప్రతిభకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి కూడా నామినేట్ అయ్యింది. ప్రస్తుతం సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోన్న ఆమె ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. తను ఫిదా ఫేమ్ శరణ్య ప్రదీప్.

 

ఇవి కూడా చదవండి

ఫిదా తర్వాత శైలజా రెడ్డి అల్లుడు, దొరసాని, జాను, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, పుష్పక విమానం, అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్, భామా కలాపం, స్వాగ్, క .. ఇలా మొత్తం 25కు పైగా సినిమాల్లో నటించింది శరణ్య. కాగా సుహాస్ నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో శరణ్య నటనకు ప్రశంసలు దక్కాయి. ఇందులో ఓ సన్నివేశంలో వివస్త్రగా నటించి పెద్ద సాహసమే చేసింది. ఇక చివరిసారిగా కిరణ్ అబ్బవరం క సినిమాలో నటించింది శరణ్య. ప్రస్తుతం ఈ అమ్మడి తర్వాతి ప్రాజెక్టులకు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది.

శరణ్య ప్రదీప్ లేటెస్ట్ ఫొటోస్..

భర్తతో శరణ్య ప్రదీప్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.