AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silk Smitha: సిల్క్ స్మితను ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన ఏకైన టాప్ హీరో ఆయనే.. డెడ్‌బాడీని చూసి చిన్న పిల్లాడిలా

ఒకటిన్నర దశాబ్దం పైగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత కోట్లాది మందికి ఎంత దగ్గరో ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? 450 సినిమాలంటే మాటలు కాదు.

Silk Smitha: సిల్క్ స్మితను ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన ఏకైన టాప్ హీరో ఆయనే.. డెడ్‌బాడీని చూసి చిన్న పిల్లాడిలా
Silk Smitha
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2023 | 6:22 PM

Share

వెండితైరపై పేలిన బ్యూటీ బాంబ్ సిల్క్ స్మిత. 80వ దశకంలో ఆమె దక్షిణాది చిత్ర సీమను ఏలారు. స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం ఆరాటపడేవారు. రిలీజ్ అవ్వని సినిమాల మేకర్స్.. ఒక్క సాంగ్ చేయరూ అంటూ సిల్క్ స్మిత వెంటపడేవారు. కళ్లతో ఆమె ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఇస్తే చాలు.. కుర్రాళ్లు బౌల్డ్ అవ్వాల్సిందే. అయితే 36 ఏళ్ళకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం. ఆమెది హత్య అని ఇప్పటికీ వాదించేవాళ్లు సైతం ఉన్నారు. ఆమె ప్రేమ విఫలమై ఇలాంటి నిర్ణయం తీసుకుందని.. సినిమా నిర్మాణ రంగంలోకి దిగి పెద్ద ఎత్తున పాలు అయినట్లు వార్తలు వచ్చాయి.  మద్యపానమే ఆమెను బలి తీసుకుంది అన్నవారు కూడా లేకపోలేదు.

చనిపోవటానికి ముందురోజు సాయంత్రం రాత్రి సిల్క్ స్మిత చాలా మందికి ఫోన్ చేసినట్టు ఆ తరువాత చాలామంది ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. కన్నడ నటుడు రవిచంద్రన్ మొదలు తెలుగు నటి అనూరాధ దాకా చాలామంది బాధపడ్డారు. స్పందించకపోవటానికి ఏవేవో కారణాలు చెప్పుకున్నారు. బయటకి చెప్పనివాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. చనిపోయాక ఆమెతో అవసరం తీరిపోయిందనుకున్న చిత్ర పరిశ్రమ కనీసం ఒక సంస్మరణ సభ కూడా జరపలేదు. మళ్ళీ ఆమె కథనే సినిమాకు ముడిసరకుగా వాడుకోవటానికీ వెనకాడలేదు.

సిల్క్ స్మిత చనిపోయిన వార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. అయితే ఆమె ఆఖరి చూపు చూసేందుకు చాలామంది రాకపోవడం అప్పటి జర్నలిస్టులను నివ్వెరపాటుకు గురిచేసింది. సిల్క్‌ను చివరి సారి చూసేందుకు వచ్చిన అప్పటి టాప్ హీరో.. అర్జున్ మాత్రమే. ఎవరూ పట్టించుకోకపోయినా అర్జున్ మాత్రమే రావటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ మాటే కొందరు జర్నలిస్టులు ఆయన్ను డైరెక్ట్‌గా అడిగేశారు. అంతకు కొద్ది రోజుల ముందే ఒక సినిమా షూటింగ్ చివరి రోజు అర్జున్ తో “నేను చచ్చిపోతే చూడ్డానికి వస్తావా”? అని అడిగిందట. “ఛీ అదేం మాట” అని తేలిగ్గా కొట్టిపారేశాడే తప్ప సీరియస్ గా తీసుకోలేదు. “ఎవరూ రాకపోయినా మీరు రావటం ఆశ్చర్యంగా ఉంది” అన్నప్పుడు ఇది గుర్తు చేసుకొని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడట అర్జున్.

Hero Arjun

Hero Arjun

(సీనియర్ జర్నలిస్ట్ తోట భవనారయణగారి నుంచి ఈ సమాచారం సేకరించబడింది)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.