యంగ్ హీరో కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. యుగాంతం నేపథ్యంలో ఒక పల్లెటూరులో జరిగిన సంఘటనల సమాహారంతో డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన బెదురులంక 2012 మొదటి షో నుంచ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఊహించిన దానికంటే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పోటీగా రిలీజైన వరుణ్ తేజ్ గాంఢీవ ధారి అర్జున, బాయ్స్ హాస్టల్‌కు నెగెటివ్ రివ్యూలు రావడంతో ప్రేక్షకులు బెదురలంక సినిమాకే బ్రహ్మరథం పడుతున్నారు. ఇందుకు తగ్గట్టే సినిమాలో కామెడీ అద్భుతంగా, అంతర్లీనంగా ఓ సందేశాన్ని కూడా ఇచ్చారంటూ ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేదు హీరో కార్తికేయ. అయితే బెదురులంక 2012 సినిమాతో ఆ లోటు తీరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. బెదురులంకకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వస్తుండడంతో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉంది మూవీ యూనిట్. కాగా బెదురులంక సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సూపర్‌హిట్ సినిమా కథ మొదట ఓ యంగ్ హీరో దగ్గరికి వెళ్లిందట. అయితే కొన్ని కారణాలతో దీనిని రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆ యంగ్ హీరో మరెవరో కాదు ఇటీవలే రంగభళితో ఆకట్టుకున్నా నాగశౌర్య.
దర్శకుడు క్లాక్స్ ఈ సినిమా కథను ముందుగా నాగశౌర్యకే చెప్పాడట. కథ బాగా నచ్చడంతో శౌర్య కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సుమారు రెండేళ్ల పాటు ఈసినిమా గురించే ట్రావెల్ చేశారట. అయితే ఏమైందో తెలియదు కానీ నాగశౌర్య బయటకు వచ్చేశాడట. కాగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తోన్న నాగశౌర్య బెదురులంక సినిమా చేసి ఉంటే మరో హిట్ ఖాతాలో పడేది ఉండేదంటున్నారు ఫ్యాన్స్. బెదురులంక సినిమాలో కార్తికేయ, నేహాతో పాటు ఎల్బీ శ్రీరామ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గోపరాజు రమణ, జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శీను తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ బాణీలు అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..