Deepika- Ranveer: దీపిక, రణ్‌వీర్.. ఇద్దరిలో ఎవరు బాగా రిచ్? ఇద్దరి ఆస్తులు కలిపి ఎన్ని కోట్లో తెలుసా?

బాలీవుడ్ లో ది మోస్ట్ బ్యూటిపుల్ కపుల్స్ లో దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ జోడీ ఒకటి. ఇద్దరూ స్టార్సే. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటున్నారా? మరి దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ లలో ఎవరు బాగా రిచ్? ఇద్దరి ఆస్తులెలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

Deepika- Ranveer: దీపిక, రణ్‌వీర్.. ఇద్దరిలో ఎవరు బాగా రిచ్? ఇద్దరి ఆస్తులు కలిపి ఎన్ని కోట్లో తెలుసా?
Deepika Padukone, Ranveer Singh

Updated on: Jul 07, 2025 | 9:22 PM

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఆదివారం (జులై 06) తన పుట్టినరోజు ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బర్త్ డే రణ్ వీర్‌ కు చాలా ప్రత్యేకం. దీనికి కారణం అతను తండ్రిగా ప్రమోషన్ పొందాడు. రణ్ వీర్ ఇంటికి ఒక పాప వచ్చింది. అందుకే అతను తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమా పనులతో పాటు, తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా బిజీగా ఉన్నారీ స్టార్ కపుల్. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే 2011 నుంచి ప్రేమించుకున్నారు. ఒక సినిమా సెట్స్‌లో వారి పరిచయం ప్రేమగా చిగురించింది. 2018లో ఇరు పెద్దల ఆశీర్వాదంతో ఇటలీలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. దీపిక ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి. ప్రస్తుతం ఆమె తన బిడ్డను చూసుకోవడంలో బిజీ బిజీగా ఉంటోంది.

కాగా రణవీర్ సింగ్ మొత్తం ఆస్తులు రూ.362 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. 2019లో అతని వార్షిక ఆదాయం రూ.21 కోట్లు. ఇప్పుడు అది గణనీయంగా పెరిగింది. రణవీర్ సింగ్ అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక దీపికా పదుకొనేకు సినిమా పరిశ్రమలో రణ్‌వీర్ సింగ్ కంటే ఎక్కువ క్రేజ్, పాపులారిటీ, డిమాండ్ ఉంది. అంతేకాదు రణ్‌వీర్ కంటే దీపిక ఖాతాలోనే సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. సక్సెస్ రేటు కూడా ఎక్కువే. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి

భర్త రణ్ వీర్ సింగ్ తో దీపిక..

 

ప్రస్తుతం దీపిక ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల కు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. దీపికా పదుకొనే మొత్తం ఆస్తులు 500 కోట్లకు పైగా ఉన్నాయని తెలుస్తోంది. అంటే ఈ ఇద్దరి దంపతుల ఆస్తులు కలిపితే మొత్తం 860+ కోట్లు అవుతుంది. రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే, ఈ సినిమా కంటే ముందు దురంధర్ సినిమా రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. ఇక దీపిక అల్లు అర్జున్ తో కలిసి ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.