Ram Charan: తండ్రి సినిమాలోనే చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన రామ్ చరణ్ ?.. కానీ తెరపై కనిపించలేదు.. ఎందుకంటే..

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్‏గా భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు చరణ్. ఈమూవీతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న చెర్రీ.. చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఓ సినిమాలో కనిపించారట. ఇప్పుడిదే విషయం ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది.

Ram Charan: తండ్రి సినిమాలోనే చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన రామ్ చరణ్ ?.. కానీ తెరపై కనిపించలేదు.. ఎందుకంటే..
Ram Charan, Chiranjeevi

Updated on: May 24, 2023 | 6:25 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో హీరోగా తెరంట్రం చేసిన చెర్రీ.. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. తన నటనతో ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్‏గా భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు చరణ్. ఈమూవీతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న చెర్రీ.. చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఓ సినిమాలో కనిపించారట. ఇప్పుడిదే విషయం ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే చరణ్ బాలనటుడిగా ఓ సినిమాలో నటించారట.

చిన్నప్పుడు ఎంతో క్యూట్‏గా ఉండే చరణ్.. అప్పుడె వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ.. ఆయన నటించిన సినిమాలోని చరణ్ సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందట. చిరంజీవి హీరోగా నటించిచన లంకేశ్వరుడు సినిమాలో చరణ్ ఓ సన్నివేశంలో నటించారట. తండ్రితోపాటు ఉన్న వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. అయితే సినిమా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చరణ్ సన్నివేశాలు సినిమాకు అతికించినట్లుగా ఉండడంతో తొలగించారట.

ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించగా.. రాజ్ కోటీ సంగీతం అందించారు. ఇందులో రాధ, రేవతి, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ కీలకపాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.