
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందిన ఇతనికి తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో ఎన్నో రొమాంటిక సినిమాల్లో నటించి సీరియల్ కిస్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మీ. ఇప్పుడు ఆ ట్యాగ్ ను తొలగించుకునేందుకు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఓజీలో విలన్ గా అదరగొట్టాడు. స్టైలిష్ గ్యాంగ్ స్టర్ ఓమీగా ఆడియెన్స్ ను మెప్పించాడు. కాగా ఓజీ సినిమా కన్నా ముందే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మీ. అడివి శేష్ నటించిన గూడఛారి 2 సినిమాలోనూ ఈ బాలీవుడ్ నటుడు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ముందుగా ఓజీతో మనకు పరిచయమయ్యాడు ఇమ్రాన్ హష్మీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో మరిన్ని సినిమా ఛాన్సులు రావొచ్చు. కాగా ఇమ్రాన్ హష్మీ చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు.
ఇమ్రాన్ హష్మీది కూడా సినిమా నేపథ్యమున్న కుటుంబమే. ఇమ్రాన్ తాత దర్శకుడు సయ్యద్ షౌకాత్ హష్మీ. నానమ్మ మెహ ర్బానో మహ్మద్ అలీ (పూర్ణిమా దాస్ వర్మ) ప్రముఖ నటి. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మహేష్ భట్ కు ఇమ్రాన్ దగ్గరి బంధువవుతాడు. అలాగే మహేష్ భట్ కూతురు, స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇమ్రాన్ కు కజిన్ సిస్టర్ అవుతుంది. ఇమ్రాన్ నాన్నమ్మ మెహెర్బానో, అలియా భట్ నాన్నమ్మ షిరిన్ మొహమ్మద్ అలీకి సోదరి. అలా ఇమ్రాన, అలియా కజిన్స్ అవుతారు.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా నటించిందీ అందాల తార. ఇందులో ఆమె అభియానికి తెలుగు ఆడియెన్స్ కూడా ముగ్దులయ్యారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.