Tollywood: ఒకే ఏడాది 34 సినిమాలు.. అందులో 25 సూపర్ హిట్స్.. ఈ స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఇప్పటి జనరేషన్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటున్నారు. ఒక్కోసారి ఆ ఒక్కటి కూడా రాదు.. కానీ ఈ స్టార్ హీరో ఒక ఏడాదిలో ఏకంగా 34 సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు. విశేషమేమిటంటే.. ఇందులో ఏకంగా 25 సూపర్ హిట్ గా నిలిచాయి

Tollywood: ఒకే ఏడాది 34 సినిమాలు.. అందులో 25 సూపర్ హిట్స్.. ఈ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Tollywood Actor

Updated on: May 21, 2025 | 3:01 PM

ఈ నటుడి వయసు ఇప్పుడు సుమారు 65 సంవత్సరాలు. గత 45 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించారు. తన అసమాన నటనతో భారత దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. 65 ఏళ్ల వయసులోనూ ఆయన కష్టపడి పని చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నారు. చాలా మంది యంగ్ హీరోలకు సాధ్యం కానీ 100 కోట్లు, 200 కోట్ల కలెక్షన్లను అవలీలగా దాటేస్తున్నారు. విశేషమేమిటంటే.. గతంలో ఒకే సంవత్సరంలో ఈ హీరో నటించిన 34 సినిమాలు విడుదలయ్యాయి. అంతకన్నా విశేషమేమిటంటే.. వీటిలో 25 సినిమాలు సూపర్ హిట్స్ కావడం. మరి ఈ రేర్ ఫీట్ సాధించిన ఆ నటుడు ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు కంప్లీట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మలయళ సూపర్ స్టార్ మోహన్ లాల్. బుధవారం (మే21) ఆయన పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే సందర్భంగా మోహన్ లాల్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

1980లో విడుదలైన ‘మంజిల్ విరింజ పూక్కల్’ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మోహన్ లాల్.
అప్పటి నుంచి ఇప్పటి వరకు, సరిగ్గా 45 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్నారాయన. 1983లో మోహన్ లాల్ నటించిన 25 కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. 1984 లో 20 కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. 1985 లో 20 కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. 1986 లో అయితే ఏకంగా 34 సినిమాలు విడుదలయ్యాయి. వీటి సక్సెస్ రేటు కూడా ఎక్కువే. ఇందులో25 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

 

యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో మోహన్ లాల్..

కాగా మోహన్ లాల్ ఒక ప్రొఫెషనల్ రెజ్లర్. పలు కుస్తీ పోటీల్లోనూ పాల్గొన్నాడు. కేరళ రాష్ట్ర రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ (1977-78) కూడా గెలుచుకున్నాడు. మోహన్ లాల్ లేటెస్ట్ గా నటించిన తుడ్ రుమ్ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.