పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా పవన్ ఓ ట్రెండ్ ను సెట్ చేశారు పవర్ స్టార్. ఇటు సినిమాలతోనే కాదు.. అటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు పవన్. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి పవర్ కృషిచేస్తున్నారు. అలాగే ఇటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి .. ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 1996 అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమాకు పవర్ స్టార్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ మూవీ ఖయామత్ సే ఖయామత్ తక్ అనే బాలీవుడ్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అప్పటి బడ్జెట్ లెక్కల ప్రకారం ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు పవన్ అందుకున్న రెమ్యునరేషన్ 5000.
పవన్ అసలు సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ సలహా మేరకు పవన్ హీరోగా మారారు. ఇప్పుడు ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పవన్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే.. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో జాతరలా జరుపుకుంటారు ఫ్యాన్స్.