Ajith Kumar-Shalini: షాలినిని పెళ్లి చేసుకోవద్దంటూ అజిత్‏ను హెచ్చరించిన డైరెక్టర్.. కానీ..

|

Mar 05, 2023 | 7:09 AM

ప్రస్తుతం గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుండగా.. అజిత్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. అయితే అప్పట్లో షాలినిని పెళ్లి చేసుకోవద్దని అజిత్‏ను హెచ్చరించాడట డైరెక్టర్ రమేశ్ ఖన్నా.

Ajith Kumar-Shalini: షాలినిని పెళ్లి చేసుకోవద్దంటూ అజిత్‏ను హెచ్చరించిన డైరెక్టర్.. కానీ..
Ajith Kumar, Shalini
Follow us on

కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‏లో అజిత్ కుమార్, షాలిని జంట ఒకటి. ఈ జోడికి తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. 1999లో అమర్కలం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు 2000 ఏప్రిల్ 24న వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ప్రస్తుతం గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుండగా.. అజిత్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. అయితే అప్పట్లో షాలినిని పెళ్లి చేసుకోవద్దని అజిత్‏ను హెచ్చరించాడట డైరెక్టర్ రమేశ్ ఖన్నా.

ప్రజలందరూ మీ గురించే మాట్లాడుతున్నారు. ఆ షాలినిని పట్టించుకోవద్దు అని చెప్పాడట. కానీ అప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న సంగతి దర్శకుడికి తెలియదట. దీంతో మరో డైరెక్టర్ శరణ్.. హీరోకే వార్నింగ్ ఇస్తున్నావు.. తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడట. అప్పుడు కానీ రమేష్ కు వారు ప్రేమలో ఉన్నారని తెలిసిరాలేదు. ఆ తర్వాత 2000లో జరిగిన అజిత్, షాలినిల వివాహానికి తాను హజరయ్యానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రమేష్.

ఇవి కూడా చదవండి

అజిత్.. షాలినిల ప్రేమకథ..

1999లో అమర్కలం సినిమాతో తొలిసారిగా వీరిద్దరు కలిసి నటించారు. ఈ సినిమా చేయడానికి మొదట షాలిని ఒప్పుకోలేదట. చదువుల కోసం మూవీస్ పక్కన పెట్టాలని నిర్ణయించుకుందట. అయితే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఎంత చెప్పినా షాలిని ఒప్పుకోలేదట. దీంతో హీరో అజిత్ రంగంలోకి దిగి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడట. తన గురించి పరిచయం చేసుకుంటూ ఆమెతో కలిసి పనిచేయాలని ఉందంటూ చాలా సేపు ముచ్చటించి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అజిత్ అనుకోకుండా ఆమె మణికట్టుకు గాయం చేయడం.. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవడం…అలాంటి సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అమర్కలం విడుదలైన మరుసటి ఏడాది వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.