Ranganath: ఆత్మహత్యకు ముందు గోడపై రంగనాథ్ ఏం రాశారో తెల్సా.. అన్నీ ఉన్నా..
సినీనటుడు, రచయిత రంగనాథ్ ఆత్మహత్య అప్పట్లో తెలుగు సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రంగనాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 300కి పైగా సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. సీరియల్స్‌లో సైతం మెప్పించారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నాడు. సాహితీవేత్తగానూ గుర్తింపు ఉంది. సినిమాల్లో మంచిగా రాణిస్తున్నప్పుడే ఆయన డిసెంబర్ 19, 2015 హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన ఇంట్లో సీలింగ్ హుక్‌కు ఉరివేసుకుని జీవితాన్ని ముగించారు. అప్పటికీ ఆయన వయస్సు 66 ఏళ్లు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేవని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. ఆయనకి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు వున్నారు.
ఆత్మహత్య చేసుకున్న రోజు రంగనాథ్ మల్కాజిగిరిలోని గౌతమ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉంది. తీసుకెళ్లేందుకు సభ నిర్వాహకులు ఆయన ఇంటికి వచ్చారు. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో.. దగ్గర్లో నివాసం ఉంటున్న కుమార్తెకు సమాచారం అందించారు. ఆమె వచ్చిన తర్వాత అందరూ కలసి తలుపులు బద్దలకొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కాగా భార్యను విపరీతంగా ప్రేమించేవారు రంగనాథ్. అనారోగ్యంతో బాధపడుతున్న అర్థాంగికి దాదాపు 15 ఏళ్లపాటు ఓపిగ్గా సపర్యలు చేశారు. ఆమె మృతితో ఆయన చాలా డిస్టబ్ అయ్యారు. ఒంటరితనానికి గురయ్యారు. దేవుడి ఫోటోల పక్కన భార్య ఫోటోను పెట్టి ఆరాధించేవారు. ఆ డిప్రెషన్‌తోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు చెబుతారు.
సూసైడ్‌కు ముందు తన మిత్రుడు, ‘నేటి నిజం’ ఎడిటర్ బైసా దేవదాసుకు ‘గుడ్ బై సార్..’ అంటూ తన మొబైల్ నుంచి లాస్ట్‌టైమ్ మెసేజ్ పంపారు. ఉరివేసుకున్న రూమ్‌లో గోడపై… ‘నా బీరువాలో పని మనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్రాబ్యాంక్ బాండ్స్‌ను ఆమెకు అప్పగించండి. డోంట్ ట్రబుల్ హర్’ అని స్కెచ్ పెన్‌తో రాశారు. తనకు ఆమె సేవ చేయడంతోనే.. అలా రాశారని చాలామంది అప్పుడు చెప్పుకొచ్చారు. అలానే డెస్టినీ (DESTINY) అని కూడా గోడపై రాశారు రంగనాథ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.