Kasthuri Shankar: హీరోయిన్ అవ్వాలని స్టార్ డైరెక్టర్‌కు పర్సనల్ ఫోటోలు పంపిన కస్తూరి.. ఆ దర్శకుడు ఎవరో తెలుసా..

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే కస్తూరి శంకర్ నటించిన భారతీయుడు సినిమాలోనూ నటించింది.

Kasthuri Shankar: హీరోయిన్ అవ్వాలని స్టార్ డైరెక్టర్‌కు పర్సనల్ ఫోటోలు పంపిన కస్తూరి.. ఆ దర్శకుడు ఎవరో తెలుసా..
Kasthuri Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 07, 2024 | 11:31 AM

అన్నమయ్య సినిమాతో కస్తూరి శంకర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది కస్తూరి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే కస్తూరి శంకర్ నటించిన భారతీయుడు సినిమాలోనూ నటించింది. ఆ సినిమాలో కమల్ హాసన్ చెల్లెలిగా నటించింది. దాంతో ఈ అమ్మడి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు వరుసగా సీరియల్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది కస్తూరి. అయితే ఈ బ్యూటీ ఓ స్టార్ దర్శకుడికి బికినీ ఫోటోలు పంపిందట.. ఈ విషయాన్నీ ఆమె తెలిపింది. ఆ దర్శకుడు ఎవరంటే..

ఇది కూడా చదవండి : Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

ఒకప్పుడు తన సినిమాతో ఇండస్ట్రీలోనే టాప్ దర్శకుడిగా రాణించారు డైరెక్టర్ శంకర్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీ షేక్ అవుతుంది. అలాగే చాలా మంది దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక శంకర్ విషయానికి కొస్తే పాన్ ఇండియా సినిమాల హవా లేనప్పుడు ఆయన తన సినిమాలతో ఇతర బాషల ప్రేక్షకులను కూడా మెప్పించారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. శంకర్ సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేవారు. శంకర్ ఈ మధ్యకాలంలో ఫ్లాప్ లను రుచిచూస్తున్నారు. ఆయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన ఇండియన్ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.

ఇది కూడా చదవండి : Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక

శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇదిలా ఉంటే శంకర్ సినిమా ఆడిషన్స్ కోసం నటి కస్తూరి పర్సనల్ ఫోటోలు పంపింది. ఈ విషయాన్నీ ఆమె సొంతంగా చెప్పింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్నీ పంచుకుంది. భారతీయుడు ఈ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో తెలిపింది కస్తూరి. భారతీయుడు సినిమా ఆడిషన్ సమయంలో శంకర్‌ను ఇంప్రెస్ చేయాలని తన బికిని ఫొటోలను పంపిందట. అలాగే తాను హీరోయిన్ గా మారాలనుకుంటున్నా అని చెప్పిందంట కస్తూరి. అయితే అదే సమయంలో రంగీలా సినిమా విడుదలైంది భారీ హిట్ అయ్యింది. దాంతో ఊర్మిళ బికిని ఫొటోలు పాపులర్ అయ్యాయి. అప్పుడు అందరి దృష్టి ఆమె పైకి మళ్లింది. ఆ తర్వాత శంకర్ ఊర్మిళాను, మనీషా కొయిరాలా హీరోయిన్స్ గా తీసుకున్నారు. కస్తూరిని కమల్ చెల్లెలిగా తీసుకున్నారు. అలా హీరోయిన్ అవుదామని బికినీ ఫోటోలు పంపితే..  తనను చెల్లెలి పాత్రకు ఓకే చేశారని చెప్పుకొచ్బింది కస్తూరి. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏవండోయ్ ఇది చూశారా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈవిడ ఎవరో కనిపెట్టారా.? ఫేమస్ సెలబ్రెటీ సతీమణి ఆమె

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!