Mrunal Thakur: మెగా హీరో సినిమాకు మృణాల్ నో చెప్పిందా.? అసలు విషయం ఏంటంటే

ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది ఈ భామ. నాని నటిస్తోన్న 30వ సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు

Mrunal Thakur: మెగా హీరో సినిమాకు మృణాల్ నో చెప్పిందా.? అసలు విషయం ఏంటంటే
Mrunal Thakur
Follow us

|

Updated on: Jan 30, 2023 | 9:06 AM

సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో సీతామహాలక్ష్మిగా నటించింది మృణాల్. చక్కని అభినయాన్ని పలికించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది ఈ భామ. ఇక ఈ భామకు టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది ఈ భామ. నాని నటిస్తోన్న 30వ సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే వచ్చిన ప్రతి కథను ఓకే చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తోంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ దగ్గరకు ఓ భారీ ఆఫర్ వెళ్లిందట. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది.

ఒక మెగా  హీరో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే మృణాల్ నో చెప్పిందని ప్రచారం జరుగుతోంది. మెగా హీరో సినిమా ఆఫర్ వస్తే కథ నచ్చలేదు అంటూ తిరస్కరించిందని ఫిలింసర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయం పై మృణాల్ ఠాకూర్ స్పందించింది.

మెగా హీరో తో సినిమా ఛాన్స్ వస్తే కథ విషయం లో నో చెప్పాను అంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చింది. తన దగ్గరకు ఎలాంటి కథ రాలేదని. ఒకవేళ మెగా హీరోల సినిమాలు వస్తే అస్సలు వదులుకోను అని క్లారిటీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్.