
ఐదేళ్లకోసారి జనరేషన్లే మారిపోతున్నాయి.. ఆఫ్ట్రాల్ కాంబినేషన్ ఎంత బాసూ..? త్రివిక్రమ్ కూడా ఇదే ఫాలో అవుతున్నారిప్పుడు. ఎంతకాలమని ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేస్తామంటూ.. వెంకీ కోసం తమన్‌ను పక్కన బెట్టి ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు అడుగులేస్తున్నారు గురూజీ. మరి మాటల మాంత్రికుడి మనసు దోచిన ఆ సంగీత సంచలనం ఎవరు..? త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్.. అదిప్పటికి కుదిరింది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు రైటర్‌గా ఉన్నపుడు వెంకీకి ఇచ్చారు గురూజీ. ఇప్పుడు దర్శకుడిగా అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో తమన్ లేరని తెలుస్తుంది.
ఒక్కో సీజన్‌లో ఒక్కో సంగీత దర్శకుడితో ట్రావెల్ అవుతుంటారు త్రివిక్రమ్. మొదట్లో అతడు, ఖలేజాకు మణిశర్మ.. జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి పని చేసారు గురూజీ. మధ్యలో అ..ఆ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అరవింద సమేత నుంచి తమన్‌తో కనెక్ట్ అయ్యారీయన.
వెంకీ సినిమా కోసం తమన్‌ను కాదని.. హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు త్రివిక్రమ్ వెళ్తున్నట్లు తెలుస్తుంది. కబీర్ సింగ్, యానిమల్‌తో ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు హర్షవర్ధన్. వెంకీ కోసం ఈయన్ని గురూజీ లైన్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్, తమన్ తర్వాత.. త్రివిక్రమ్ లిస్టులోకి హర్షవర్ధన్ ఎంట్రీ ఇస్తారా చూడాలిక..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.