Shekar kammula: పాన్ ఇండియా ట్రెండ్‌లోనే సరికొత్త వెర్షన్‌… శేఖర్ కమ్ముల అండ్ ధనుష్ చేస్తున్న డ్యూయల్ ఎఫర్ట్‌

సౌతిండియన్ సినిమాలో కనీవినీ ఎరుగని కాంబినేషన్లు ఫిక్సవుతున్నాయి. ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతోంది రేపటి సినిమా. ఈ ట్రెండ్‌లో నేను సైతం...

Shekar kammula: పాన్ ఇండియా ట్రెండ్‌లోనే సరికొత్త వెర్షన్‌... శేఖర్ కమ్ముల అండ్ ధనుష్ చేస్తున్న డ్యూయల్ ఎఫర్ట్‌
Dhanush Sekhar Kammula
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 20, 2021 | 12:26 PM

సౌతిండియన్ సినిమాలో కనీవినీ ఎరుగని కాంబినేషన్లు ఫిక్సవుతున్నాయి. ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతోంది రేపటి సినిమా. ఈ ట్రెండ్‌లో నేను సైతం అంటూ ముందుకొచ్చారు మంచి కాఫీ లాంటి సినిమాల స్పెషలిస్ట్‌ శేఖర్‌ కమ్ముల. ఆయన అప్‌కమింగ్ ఫీట్‌ ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీకే షాకిస్తోంది. కోలీవుడ్ హీరో ధనుష్‌తో ట్రైలింగువల్ మూవీ… డైరెక్టెడ్ బై శేఖర్ కమ్ముల..! ఈ మాట వినగానే తెలుగు ఫిలిమ్‌ సర్కిల్స్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అరె.. ఇదెక్కడి కాంబినేషన్‌… మనం కల్లో కూడా ఊహించలేదే అనేది ఆడియన్స్‌ రియాక్షన్. శేఖర్‌ కమ్ముల నుంచి సర్‌ప్రైజెస్ కామనే ఐనా.. ఇది మాత్రం సూపర్‌మోస్ట్‌ సర్‌ప్రైజ్‌.

టాలీవుడ్‌లో మోస్ట్ బ్రీజీయస్ట్‌ మూవీ హ్యాపీడేస్ తీసిన తర్వాత.. వాటీజ్ శేఖర్ కమ్ముల అనేది తెలుగు ఆడియన్స్‌కి అర్థమైంది. లీడర్‌ లాంటి పాత్‌ బ్రేకర్‌… ఫిదా లాంటి ఫీల్‌గుడ్‌ మూవీని చూశాక.. శేఖర్‌ నుంచి ఎంతైనా ఆశించవచ్చని కన్‌ఫమ్‌ చేసుకున్నాడు తెలుగు ప్రేక్షకుడు. కట్‌చేస్తే… ఇప్పుడు తమిళ ప్రేక్షకుడ్ని కూడా అదే స్థాయిలో ఫిదా చెయ్యబోతున్నారు శేఖర్. 17 భాషల్లో 190 దేశాల్లో తన సినిమా రిలీజైందన్న జోష్‌లో వున్న ధనుష్‌.. ఇదేరోజు శేఖర్‌ కమ్ములతో బిగ్ డీల్ ఓకే చేసుకుని మరో ఎక్స్‌పరిమెంట్‌కి తెరతీశారు. తనకిది తెలుగులో ఫస్ట్‌ స్ట్రెయిట్ మూవీ. శేఖర్‌ దగ్గరుండే కంటెంట్‌… తన దగ్గరుండే పెర్‌ఫామెన్స్‌ మింగిలైతే.. ఒక అద్భుతం ఖాయమన్నది ధనుష్ భరోసా కావొచ్చు.

సడన్‌గా కోలీవుడ్ స్టార్‌డమ్‌ మీద మన శేఖర్‌ ఎలా మనసు పడ్డారన్నది కూడా మరో మిస్టరీ. శేఖర్‌ సినిమాల్లో నాణ్యతను ఆడియన్స్‌ పసిగట్టినంత గట్టిగా మన స్టార్‌హీరోలు గ్రహించలేకపోయారు. పైగా.. తానొక బ్యాడ్ నెరేటర్‌నని.. రాసుకున్న కథను సరిగ్గా చెప్పడం రాదని తనే ఒప్పుకుంటారు శేఖర్‌. సరే… ఆయనకు కన్విన్స్‌ చెయ్యడం రాకపోతేనేం.. మన హీరోలు మాత్రం ముందుకు రాలేదు ఎందుకు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. గోదావరి సినిమాలో ఒరిజనాలిటీని సుమంత్ ఇంకా మర్చిపోలేదు. ఆనంద్‌ సినిమాలో కాఫీ ఫ్లేవర్‌ని లైఫ్‌లాంగ్ గుర్తు చేసుకుంటారు రాజా. హ్యాపీడేస్‌ తన కెరీర్‌లో అల్టిమేట్‌ అంటారు తమన్నా. తాను… ఎన్ని సినిమాలు చేసినా అవన్నీ లీడర్‌ ముందు దిగదుడుపేనంటారు రానా. కొందరు చేసే సినిమాలకు కథే హీరో. శేఖర్ కమ్ముల సినిమాలన్నిటిదీ అదే లెక్క. అందుకే హీరోయిజం కోసం కొత్తగా ఎక్కడా కష్టపడి వెతుక్కోరాయన. ఇప్పుడు ధనుష్‌లోని న్యాచురల్ యాక్టింగ్‌కీ.. తన దగ్గరుండే స్టోరీ లైన్‌కి అలాగే సింక్ అయ్యుండొచ్చు. అలా కుదిరిందే ఈ క్రేజీ మల్టిలింగువల్.

ఎస్వీసీ LLP బేనర్‌పై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ.. ఇప్పుడు నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్‌లోనే సరికొత్త వెర్షన్‌ కాబోతోంది. శేఖర్ కమ్ముల అండ్ ధనుష్ చేస్తున్న ఈ డ్యూయల్ ఎఫర్ట్‌.. క్రాస్‌ బార్డర్ మార్కెటింగ్ స్ట్రాటజీలో మరో పైమెట్టు కాబోతోంది. ఇక.. హీరోయిన్‌ ఎవరు… మ్యూజిక్ ఎవరి దగ్గర తీసుకుంటారు లాంటి క్యూరియాసిటీ కూడా తీరిపోతే… ఈ ప్రాజెక్ట్‌ ఇంకాఇంకా క్రేజీగా మారే ఛాన్సుంది.

Also Read: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

ఏటీఎంలో చోరి కేసులో దొరికారు.. విచార‌ణ‌లో పోలీసుల మైండ్ బ్లాంక్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!