
సాధారణంగా స్టార్ హీరో అంటే ఒక సినిమా పూర్తయితే గానీ మరో సినిమా చేయరు. అదే గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్న హీరో అంటే ఒక్కో సినిమా మీదే ఏళ్ల తరబడి వర్క్ చేస్తుంటారు. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు ఓ కోలీవుడ్ స్టార్ హీరో. సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా జెట్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.రీసెంట్‌గా సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసిన ధనుష్… ఇప్పుడు సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. లాస్ట్ ఇయర్ మారన్, ది గ్రే మ్యాన్, తిరు చిత్రాంబలం, నానే వరువేన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ కోలీవుడ్ స్టార్ హీరో. ఆఫ్టర్ కోవిడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమా రిలీజ్ కోసమే ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటే ధనుష్ మాత్రం ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు ఈ ఏడాది కూడా అదే జోరుతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
2023లో ఇప్పటికే సర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్, నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలను పట్టాలెక్కించారు. కెప్టెన్ మిల్లర్ షూటింగ్ జరుగుతుండగానే బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీని ఎనౌన్స్ చేశారు. తేరే ఇష్క్ మే సినిమాతో నార్త్ మార్కెట్ మీద మరోసారి సీరిస్‌గా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా తన ఓన్ డైరెక్షన్‌లో 50 సినిమాను కూడా స్టార్ట్ చేశారు ధనుష్. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023
Captain Miller First look ! Respect is freedom pic.twitter.com/DDrFjjO46r
— Dhanush (@dhanushkraja) June 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..