ఢిల్లీలో 67వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ 2023 ప్రధానోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. అయితే డీఎస్పీ అవార్డ్ అందుకోవడం చూసి అల్లు అర్జున్ ఎంతో సంతోషించారు. ఆ క్షణాలను తన ఫోన్లో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. నేషనల్ అవార్డ్స్ విజేతలను మెడల్, సర్టిఫికేట్‌తో సత్కరించారు. పుష్ప సినిమాలోని సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యావత్ వరల్డ్ వైడ్ గా ఉన్న మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాలోని ఊ అంటావా మావ.. సామి సామి పాటలకు విదేశీయులు కాలు కదిపిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.
THE MAN WHO SHOOK THE ENTIRE NATION WITH THE CHARTBUSTER ALBUM ❤️🔥❤️🔥
ఇవి కూడా చదవండిROCKSTAR @ThisIsDSP receives the ‘Best Music Direction – Songs’ Award at the ’69th National Film Awards’ Ceremony for #PushpaTheRise 🎼🎼
Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku… pic.twitter.com/aIwaBpJYd3
— Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2023
పుష్ప సినిమాలోని పుష్ప రాజ్ నటనకు గానూ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు అల్లు అర్జున్. ఈ వేడుకలలో బన్నీ పక్కన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూర్చొగా.. SS రాజమౌళి వెనుక కూర్చుని కనిపించారు. వేదికపైకి దేవీ శ్రీ ప్రసాద్ అవార్డ్ అందుకున్న సమయాన్ని రికార్డ్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ చిరునవ్వుతో కనిపించాడు. బన్నీ స్పెషల్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
అంతకుముందు అల్లు అర్జున్ రెడ్ కార్పెట్ మీద మాట్లాడుతూ. “నేను ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. కమర్షియల్ సినిమా కోసం దీనిని అందుకోవడం వ్యక్తిగతంగా నాకు డబుల్ అచీవ్‌మెంట్.” అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.